Fake News, Telugu
 

అరవింద్ కేజ్రీవాల్ ఐఐటి ఖరగ్‌పూర్ లో చదువుకునేటప్పుడు ఏ రేప్ కేసులో అరెస్ట్ కాబడలేదు. అది ఒక ఫేక్ న్యూస్ పేపర్ క్లిప్

0

ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐఐటి ఖరగ్‌పూర్ లో చదువుకునేటప్పుడు ఒక అమ్మాయిని రేప్ చేసాడని క్లెయిమ్ చేస్తూ, ఆ వార్తని ప్రచురించిన ఒక న్యూస్ పేపర్ క్లిప్ తో కూడిన ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో కొంతమంది షేర్ చేస్తున్నారు. ఆ క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఢిల్లీ ముఖ్యమంత్రి, అరవింద్ కేజ్రీవాల్ ఐఐటి ఖరగ్‌పూర్ లో చదువుకునేటప్పుడు ఒక అమ్మాయిని రేప్ చేసాడు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో ఉన్న న్యూస్ పేపర్ క్లిప్ ని డిజిటిల్ గా సృష్టించారు. అరవింద్ కేజ్రీవాల్ ఐఐటి ఖరగ్‌పూర్ లో చదువుకునేటప్పుడు ఒక అమ్మాయిని రేప్ చేసాడని ఎక్కడా రిపోర్ట్ కాలేదు. కావున, పోస్ట్ లోని క్లెయిమ్ తప్పు.

పోస్టులో క్లెయిమ్ చేసిన విషయం గురించి ఇంటర్నెట్ లో వెతికితే ఎక్కడ కూడా అరవింద్ కేజ్రీవాల్ ఐఐటి లో చదువుకునేటప్పుడు ఒక అమ్మాయిని రేప్ చేసిన కేసు లో అరెస్ట్ కాబడ్డాడు అనే సమాచారం కనిపించలేదు. ‘fodey.com‘ అనే వెబ్సైట్ నుంచి  ఇలాంటి ఫేక్ న్యూస్ క్లిప్స్ తయారుచేయవచ్చు. పోస్టు లోని  న్యూస్ క్లిప్ లో ఉన్న మూడవ కాలమ్ మరియు fodey.com లో ఉన్న న్యూస్ పేపర్ క్లిప్ మూడవ కాలమ్ కూడా ఒకటే ఉండడం గమనించవచ్చు. కావున, పోస్ట్ లో పెట్టిన ఫేక్ న్యూస్ క్లిప్ కూడా ఇలానే తయారు చేసి ఉండవొచ్చు.

fodey.com వెబ్సైటు ఉపయోగించి ఎవరైనా తమకు ఇష్టం వచ్చిన హెడ్ లైన్ మరియు సమాచారం తో న్యూస్ క్లిప్ ని తయారు చేసుకోవచ్చు. FACTLY కూడా fodey.com వెబ్సైటు ఉపయోగించి పోస్ట్ లో ఉన్న న్యూస్ క్లిప్ ని తిరిగి తయారుచేసిన విధానాన్ని కింద చూడవచ్చు.

చివరగా, 19 సంవత్సరాల ఐఐటి ఖరగ్‌పూర్ విద్యార్థి, అరవింద్ కేజ్రీవాల్ , ఒక అమ్మాయిని రేప్ చేసాడు అనే వార్త తో కూడినది ఒక ఫేక్  న్యూస్ పేపర్ క్లిప్.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll