Fake News, Telugu
 

భారత ఎన్నికల సంఘం కొత్త ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (EVMs) తయారీ కోసం అదానీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా షేర్ చేస్తున్న ఈ వార్త ఫేక్

0

భారత ఎన్నికల సంఘం 8 లక్షల కొత్త ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (EVMs) తయారీ కోసం భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ (BEL), ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆఫ్ ఇండియాతో(ECIL) పాటు అదానీకి చెందిన కంపెనీకి కూడా ఆర్డర్ ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ విస్తృతంగా షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: భారత ఎన్నికల సంఘం 8 లక్షల కొత్త ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (EVMs) తయారీ కోసం BEL, ECILతో పాటు అదానీకి చెందిన కంపెనీకి కూడా ఆర్డర్ ఇచ్చింది.

ఫాక్ట్ (నిజం): 2024 సార్వత్రిక ఎన్నికల కోసం కొత్తగా 8 లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను (EVMs) తయారు చేయాలని భారత ఎన్నికల సంఘం BEL మరియు ECIL ప్రభుత్వ సంస్థలకు ఆదేశాలిచ్చినట్టు ఇటీవల పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. ఈవిఎం మరియు వివిపాట్ మెషిన్లను దేశీయంగా కేవలం BEL మరియు ECIL సంస్థలు మాత్రామే రూపొందిస్తాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు 17 మార్చి 2023 నాడు ఇచ్చిన లోక్‌సభ సమాధానంలో స్పష్టం చేశారు. కొత్త ఈవిఎం మెషిన్ల తయారీ కోసం భారత ఎన్నికల సంఘం అదానీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఎటువంటి ఆధారాలు లేవు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.    

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం కొన్ని సంబంధిత కీ పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, 2024 సార్వత్రిక ఎన్నికల కోసం కొత్తగా 8 లక్షలకు పైగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను (EVMs) తయారు చేయాలని భారత ఎన్నికల సంఘం భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ (BEL) మరియు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆఫ్ ఇండియా(ECIL) సంస్థలకు ఆదేశాలిచ్చినట్టు ఇటీవల పలు వార్తలు రిపోర్ట్ చేసినట్టు తెలిసింది. ఈ కొత్త EVM మెషిన్ల తయారీ కోసం భారత ఎన్నికల సంఘం అదానీ సంస్థతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఈ వార్తా రిపోర్టులలో ఎక్కడా పేర్కొనలేదు.

EVM మరియు VVPAT మెషిన్లను దేశీయంగా కేవలం BEL మరియు ECIL సంస్థలు మాత్రమే డిజైన్ చేసి రూపొందిస్తాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రెజ్జు 17 మార్చి 2023 నాడు ఇచ్చిన ఒక లోక్‌సభ సమాధానంలో స్పష్టంగా పేర్కొన్నారు.

EVM మెషిన్లను కేవలం BEL మరియు ECIL సంస్థలు రూపొందిస్తాయని భారత ఎన్నికల సంఘం వారు తమ వెబ్సైటులో స్పష్టంగా పేర్కొన్నారు. EVM మెషిన్ల చరిత్ర మరియు వాటి తయారీకి సంబంధించి భారత ఎన్నికల సంఘం వెబ్సైటులోని సమాచారాన్ని ఇక్కడ చూడవచ్చు. కొత్త EVM మెషిన్ల తయారీ కోసం భారత ఎన్నికల సంఘం అదానీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఎటువంటి ఆధారాలు లేవు.

చివరగా, భారత ఎన్నికల సంఘం కొత్త ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (EVMs) తయారీ కోసం అదానీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా షేర్ చేస్తున్న ఈ వార్తా తప్పు.

Share.

About Author

Comments are closed.

scroll