Fake News, Telugu
 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని 2018 లోనే మార్చారు. కొత్త చిహ్నంలోని ‘పూర్ణ ఘటకం’ కి క్రైస్తవ మతానికి సంబంధం లేదు

0

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని ఇటీవల ప్రభుత్వం మార్చిందనీ, అంతకుముందు చిహ్నంలో ఉన్న ‘పూర్ణకుంభం’ స్థానంలో ఇప్పుడు ‘చర్చిల్లో నీళ్ళు చల్లే చెంబు’ చేరిందని చెప్తూ, పాత ఫోటో మరియు కొత్త ఫోటో అని ఉన్న రెండు ఫొటోలతో కూడిన కొలేజ్ ని ఫేస్బుక్ లో చాలా మంది పోస్టు చేస్తున్నారు. పోస్టులో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని ఇటీవల ప్రభుత్వం (వై.ఎస్.ఆర్.సి.పి) మార్చింది, అంతకు ముందు అందులో ఉన్న ‘పూర్ణకుంభం’ స్థానంలో ఇప్పుడు ‘చర్చిల్లో నీళ్ళు చల్లే చెంబు’ ని చేర్చింది.

ఫాక్ట్ (నిజం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని 2018 లోనే గత ‘టీడీపీ’ ప్రభుత్వం మార్చింది. అంతకుముందు ఆ చిహ్నంలో ఉన్న ‘పూర్ణ కుంభం’ స్థానంలో ఇప్పుడు ‘పూర్ణ ఘటకం’ ని చేర్చారు. కావున, పోస్టులో చెప్పింది తప్పు.    

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 14 నవంబర్ 2018 న జి.ఓ. ద్వారా రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మార్చింది. ఆ జి.ఓ. లో కొత్తగా రూపొందించబడిన రాష్ట్ర చిహ్నం ‘అమరావతి స్కూల్ అఫ్ ఆర్ట్’ ప్రేరణతో రూపొందించినట్లుగా తెలిపారు. కొత్త చిహ్నంలో ఉన్న భాగాలను కూడా అందులో వివరించారు. దాని ద్వారా, అంతకుముందు రాష్ట్ర చిహ్నంలో ఉన్న ‘పూర్ణ కుంభం’ స్థానంలో ఇప్పుడు కొత్త చిహ్నంలో ‘పూర్ణ ఘటకం’ ని చేర్చారని తెలుసుకోవచ్చు. ‘పూర్ణ ఘటం’ కి క్రైస్తవ మతానికి సంబంధం ఏమీ లేదు. 

చివరగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని 2018 లోనే మార్చారు.కొత్త చిహ్నంలోని ‘పూర్ణ ఘటకం’ కి క్రైస్తవ మతానికి సంబంధం ఏమీ లేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll