Fake News, Telugu
 

ఆర్.బీ.ఐ రిలీజ్ చేసిన సెలవుల లిస్టులోని అన్ని సెలవులు ఒకే రాష్ట్రంలో వర్తించవు

0

2020 జనవరిలో బ్యాంకులకు 16 రోజు సెలవులు ఉన్నాయని చెప్తూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో కొందరు షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2020 జనవరిలో బ్యాంకులకు 16 రోజు సెలవులు.

ఫాక్ట్ (నిజం): ఆర్.బీ.ఐ రిలీజ్ చేసిన సెలవుల లిస్టు ప్రకారం జనవరిలో 16 రోజులు [శనివారాలు (రెండవ మరియు నాల్గవ శనివారాలు) మరియు ఆదివారాలు కలుపుకొని)] సెలవులు ఉన్నాయి. కానీ, అన్ని సెలవులు అన్ని రాష్ట్రాల్లో వర్తించవు. కావున పోస్ట్ లో ‘బ్యాంకులకు 16 రోజులు సెలవులు’ అని చెప్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు.

ఆర్.బీ.ఐ రిలీజ్ చేసిన సెలవుల లిస్టుని వారి వెబ్ సైట్ లో చూడవొచ్చు. ఆ లిస్టు ప్రకారం జనవరిలో 16 రోజులు [శనివారాలు (రెండవ మరియు నాల్గవ శనివారాలు) మరియు ఆదివారాలు కలుపుకొని)] సెలవులు ఉన్నాయి. కానీ, సరిగ్గా గమనిస్తే, అన్ని సెలవులు అన్ని రాష్ట్రాల్లో వర్తించవని చూడవొచ్చు. శని, ఆదివారలు కాకుండా ఆర్.బీ.ఐ ఇచ్చిన పది రోజుల సెలవుల్లో కేవలం గరిష్టంగా చెన్నయ్ లో నాలుగు రోజులు సెలవులు ఉన్నాయి. హైదరాబాద్ లో అయితే ఒక్క రోజు మాత్రమే సెలవు ఉన్నట్టు లిస్టు లో చూడవొచ్చు. అలానే, మిగితా ప్రదేశాల్లో కూడా ఇచ్చిన పది రోజుల్లో ఏవి వర్తిస్తాయో చూడవొచ్చు.

ఈ లిస్టు ప్రకారం ఒక ప్రదేశం లోని బ్యాంకుల్లో గరిష్టంగా పది రోజులు సెలవులుంటే (శని, ఆది వారాలు కలుపుకొని) ఇంకొన్ని చోట్ల కేవలం ఆరు రోజులు (అవి అన్ని శని, ఆది వారాలే) మాత్రమే సెలవులు ఉన్నాయి.

చివరగా, ఆర్.బీ.ఐ రిలీజ్ చేసిన సెలవుల లిస్టులోని అన్ని సెలవులు ఒకే రాష్ట్రంలో వర్తించవు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll