Fake News, Telugu
 

వారణాసిలో ప్రజలు మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారని ఎడిట్ చేసిన వీడియోను షేర్ చేస్తున్నారు

0

మోదీ ఉత్తరప్రదేశ్ పర్యటనలో అక్కడి ప్రజలు ‘మోదీ గో బ్యాక్’ అని అన్నారని ఒక వీడియోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మోదీ ఉత్తరప్రదేశ్ పర్యటనలో అక్కడి ప్రజలు ‘మోదీ గో బ్యాక్’ అని అంటున్న వీడియో.

ఫాక్ట్: వీడియోలో ఎక్కడా కూడా ‘మోదీ గో బ్యాక్’ అనే నినాదాలు చేయలేదు. 14 డిసెంబర్ 2021న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో తనిఖీ (inspection)కు వెళ్ళారు. అర్ధరాత్రి దాటినా అక్కడి స్థానిక ప్రజలు ‘మోదీ జిందాబాద్’ అంటూ నినాదాలు చేసారు, ‘జై శ్రీ రామ్’ నినాదాలు చేసారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.       

వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే విజువల్స్‌తో ఉన్న వీడియో ట్విట్టర్‌లో లభించింది. 14 డిసెంబర్ 2021న బీజేపీ జాతీయ ప్రతినిధి శేహజాద్ పూనావాల మోదీ వారణాసి పర్యటనపై కొన్ని వీడియోలను ట్వీట్ చేసారు. అందులోని ఈ వీడియోనే బాగా వైరల్ అయ్యింది. అతను పోస్ట్ చేసిన వీడియోలో ఎక్కడా కూడా ‘మోదీ గో బ్యాక్’ అనే నినాదాలు లేవు. పూనావాల ట్వీట్ త్రెడ్ లో పోస్ట్ చేసిన ఇతర వీడియోల్లో కూడా ఇటువంటి నినాదాలు చేయలేదు. అర్ధరాత్రి దాటినా మోదీపై ప్రజల అభిమానం ఏమాత్రం తగ్గలేదని ట్వీట్‌లో అన్నారు.

14 డిసెంబర్ 2021న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో తనిఖీ (inspection)కు వెళ్ళారు. అర్ధరాత్రి దాటినా అక్కడి స్థానిక ప్రజలు ‘మోదీ జిందాబాద్’ అంటూ నినాదాలు చేసారని, ‘జై శ్రీ రామ్’ నినాదాలు చేసారని టైమ్స్ ఆఫ్ ఇండియా వీడియో రిపోర్టులో చూడొచ్చు. మోదీ వారణాసి పర్యటనకు సంబంధించిన వీడియోల్లో (ఇక్కడ మరియు ఇక్కడ) ఎక్కడా కూడా ‘మోదీ గో బ్యాక్’ అనే నినాదాలు చేయలేదు.

చివరగా, ఇటీవల మోదీ వారణాసి పర్యటనకు సంబంధించిన ఈ వీడియోలో ‘మోదీ గో బ్యాక్’ అని అక్కడి ప్రజలు అన్నట్టు ఎడిట్ చేసిన వీడియోను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll