‘దుబాయ్ బుర్జ్ ఖలీఫా మీద శ్రీ రాముడి 3D చిత్రం..’ అని చెప్తూ శ్రీ రాముడి బొమ్మతో వెలుగుతున్న బుర్జ్ ఖలీఫా యొక్క ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ ఫొటో వెనుక ఉన్న నిజానిజాలు ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: శ్రీ రాముడి యొక్క 3D చిత్రం దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా మీద ప్రదర్శించారు.
ఫ్యాక్ట్ (నిజం): బుర్జ్ ఖలీఫా పైన శ్రీ రాముని చిత్రాన్ని ప్రదర్శించినట్టు ఎటువంటి వార్తా కథనాలు ఇంటర్నెట్లో లేవు. వైరల్ ఫోటో యొక్క ఒరిజినల్ ఫోటో షటర్‌స్టాక్, అడోబీ స్టాక్ వంటి స్టాక్ ఫొటోలు లభించే వెబ్సైటులలో ఉంది. ఇందులో శ్రీ రాముని ప్రొజెక్షన్ బుర్జ్ ఖలీఫా పైన లేదు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
అసలు దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా పైన శ్రీ రాముని యొక్క 3D చిత్రాన్ని ప్రాజెక్ట్ చేసారా అని తెలుసుకోవడానికి, తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతుకగా, ఎటువంటి సంబంధిత వార్తా కథనాలు లభించలేదు. ఆ తర్వాత వైరల్ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, దాన్ని పోలిన ఫోటో అడోబీ స్టాక్, షటర్‌స్టాక్ వంటి స్టాక్ ఇమేజ్ వెబ్సైటులలో లభించింది.

షటర్‌స్టాక్ వెబ్సైటులో ఈ ఫోటో యొక్క టైటిల్ ‘DUBAI, UAE – DECEMBER 28: Night view of Burj Khalifa tower in Dubai on December 28, 2015….’ అని ఉంది. వైరల్ ఫోటో మరియు ఈ స్టాక్ ఫోటో మధ్య ఉన్న పోలికలను బట్టి, ఈ ఫోటోను ఉపయోగించి, శ్రీ రాముని 3D ఫోటో బుర్జ్ ఖలీఫా మీద ప్రాజెక్ట్ చేసినట్టు కనబడేలా వైరల్ ఫోటోను ఎడిట్ చేసారని మనం నిర్దారించుకోవచ్చు. వైరల్ ఫోటో మరియు ఒరిజినల్ ఫోటోలను కింది చూడవచ్చు.

చివరిగా, డిజిటల్‌గా ఎడిట్ చేసిన ఫోటోని దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా మీద శ్రీ రాముడి 3D ఫోటో ప్రదర్శించినట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు.