Fake News, Telugu
 

గత ఏడాది జగన్నాథ రథయాత్ర అప్పటి ఫోటోని ఇటీవల అయోధ్య రామ మందిరానికి వెళ్తున్న ప్రజల ఫోటో అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

0

22 జనవరి 2024 నాడు అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట జరిగిన సందర్భంలో, ఈ మందిరానికి వెళ్తున్న భక్తుల ఫోటో అని చెప్తూ,  ‘ అయోధ్య రామయ్య కోసం ఒక్కటైన హిందువులు.. ’ అనే వివరణతో  ఒక జన ప్రవాహం యొక్క ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

క్లెయిమ్: ఈ ఫోటో అయోధ్య రామ మందిరానికి హాజరైన భక్తులని చూపిస్తుంది. 

ఫాక్ట్(నిజం): ఇది ఒక పాత ఫోటో. 2023 జూన్ 20వ తారీఖున పూరీలో జరిగిన జగన్నాథ రథయాత్ర సమయంలో తీసిన ఫోటో ఇది. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

ఈ ఫోటో గురించి మరిన్ని వివరాలని తెలుసుకోవటానికి దీన్ని ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా. ఈ ఫోటో కలిగి ఉన్న కొన్ని 2023 నాటి వార్త కథనాలు (ఇక్కడ, ఇక్కడ) దొరికాయి. ఈ కథనాల ప్రకారం, ఈ ఫోటో జూన్ 2023లో ఓడిశాలోని పూరీలో ఉన్న జగన్నాథ ఆలయంలో ప్రతి ఏడాది జరిగే జగన్నాథ రథయాత్రకి హాజరైన భక్తులను చూపిస్తూ తీసిన ఫోటో. 

ఇదే ఫోటోని జూన్ 2023లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ట్వీట్ చేసారు. పూరీ రథ యాత్రకి వచ్చిన భక్తుల సమూహం అని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు.

ప్రతిష్ట తర్వాత,అయోధ్యలోని రామ మందిరానికి చాలా మంది భక్తులు వెళ్తున్నారు ఆ దృశ్యాలని మీరు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. కానీ, వైరల్ ఫోటో మాత్రం ఈ కార్యక్రమానికి చెందినది కాదు. 

చివరిగా, అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టకి హాజరైన భక్తులని చూపిస్తున్న ఫోటో అని చెప్పి షేర్ చేస్తున్న ఈ ఫోటో పాతది, 2023లో ఒడిశాలో తీసినాది.

Share.

About Author

Comments are closed.

scroll