Fake News, Telugu
 

ఈ పువ్వు రెక్కలను ఆ విధంగా అమర్చటం వల్ల మాత్రమే అది నమస్కరిస్తున్నట్లు కనిపిస్తుంది

0

“ఇది అపూర్వమైన పలాక్ష అనే చెట్టు పువ్వు. దీని ఆకారం భగవంతునికి నమస్కరిస్తునట్లు వుంటుంది.” అంటూ ఒక ఫేస్ బుక్ పోస్టు ద్వారా ఒక ఫోటో బాగా ప్రచారమవుతోంది. ఇందులో ఎంత నిజం ఉందో చూద్దాం.

క్లెయిమ్: పలాక్ష అనే చెట్టు పువ్వు ఆకారం భగవంతునికి నమస్కరిస్తున్న ఆకారం లో ఉంటుంది.

ఫాక్ట్ (నిజం): పలాక్ష అనే పేరు గల చెట్టు ఉన్నట్లు ఎక్కడా ఆధారాలు లేవు. ఫోటోలో ఉన్న పువ్వు పేరు ‘మోదుగ పువ్వు’. ఇది అర్థ చంద్రాకారం లో ఉంటుంది. పువ్వు రెక్క ఒకదానిని మొదలు భాగంలో పెట్టి, మిగిలిన రెండిటినీ కాళ్ళ లాగా అమర్చటం వల్ల అది నమస్కరిస్తున్నట్లు కనిపిస్తుంది. కావున, ఈ పోస్టు తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా “పలాక్ష చెట్టు” అని ఇంటర్నెట్ లో వెతకగా, సరైన వివరాలు దొరకలేదు. ఇక ఫోటో షేర్ చేసిన పోస్ట్ క్రింద కామెంట్లను గమనిస్తే, కొందరు దీనిని “మోదుగ పువ్వు” గా గుర్తించారు. ఈ సమాచారంతో ఇంటర్నెట్ లో మోదుగ పువ్వు అని వేతకగా కింద ఉన్న ఫోటోలు దొరికాయి.

ఈ వికీపీడియా ఆర్టికల్ ప్రకారం ,“మోదుగ ఒక ఎర్రని పూల చెట్టు. ఈ పువ్వులను అగ్నిపూలు అని పిలుస్తారు. ఇది ఫాబేసి కుటుంబంలో బుటియా ప్రజాతికి చెందిన పుష్పించే మొక్క. దీని శాస్త్రీయ నామం బుటియా మోనోస్పెర్మా (Butea monosperma).” ఈ చెట్టు భారతదేశం లో చాలా ప్రదేశాలలో ఉంటుంది.

పైన ఉన్న ఫోటోల ఆధారంగా మోదుగ పువ్వు అర్థ చంద్రాకారంలో ఉందని చెప్పచ్చు . కాకపోతే, పువ్వు యొక్క రెక్కలు దాని మొదలు భాగం పైన వాలి ఉంటాయి. వైరల్ అవుతున్న ఫోటోలో కూడా ఇలాగే పువ్వు రెక్కలని దాని మొదలు కింద పెట్టి, మిగతా రెండు రెక్కలను కాళ్ళ లాగా అమర్చారు.

చివరగా, పలాక్ష అనే చెట్టు పువ్వు భగవంతుడికి నమస్కరిస్తున్నట్లు ఉంటుంది అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll