ఇది వందేళ్లకు ఒకసారి కనిపించే మహిమగల మేకసీతకోక చిలుక అంటూ ఒక ఫోటోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పైగాఈ ఫోటో చాలా అదృష్టం గలది, చూసిన వెంటనే షేర్ చెయ్యండని కూడా చెప్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా ఆ ఫోటోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: వందేళ్లకు ఒకసారి కనిపించే మహిమగల మేకసీతకోక చిలుక ఫోటో.
ఫాక్ట్(నిజం): ఈ ఫోటో నిజం కాదు, ఇది డిజిటల్‌గా తయారు చేసింది. ఈ ఫోటో చాలా సంవత్సరాల నుండే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. ఒక ఇంటర్నెట్ వినియోగదారుడు రెండు వేర్వేరు జంతువుల ఫోటోలను డిజిటల్‌గా ఎడిట్ చేసి హైబ్రిడ్ జంతువలంటూ పలు ఫోటోలను వ్యంగంగా షేర్ చేసాడు, ఈ ఫోటోలలో ఇప్పుడు వైరల్ అయిన మేకసీతకోక చిలుక ఫోటో కూడా ఉంది. మేకసీతకోక చిలుక అనే ఒక ప్రాణి ఉన్నట్టు ఎటువంటి సమాచారం లేదు. ఐతే ఇటీవల ఒక ఫేస్‌బుక్ వినియోగదారుడు ఈ ఫోటోని వ్యంగంగా షేర్ చేయగా, ఇది నిజం అనుకోని చాలా మంది దీనిని షేర్ చేయడం మొదలుపెట్టారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో దీనిని షేర్ చేసిన అతను, ఈ ఫోటో నిజం కాదని, గ్రాఫిక్స్ ద్వారా తయారు చేసిందని వివరణ ఇచ్చాడు, దీనిని షేర్ చేయడం ఆపండని కోరుతూ తన ఫేస్‌బుక్‌లో పలు సార్లు పోస్ట్ చేసాడు. అయినా కూడా ఈ ఫోటోని నిజం అనుకోని షేర్ చేస్తూనే ఉన్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
మేకసీతకోక చిలుక అనే ఒక ప్రాణి ఉన్నట్టు ఎటువంటి సమాచారం లేదు. ఈ ఫోటో చాలా సంవత్సరాల నుండే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. ఒక ఇంటర్నెట్ వినియోగదారుడు రెండు వేర్వేరు జంతువుల ఫోటోలను డిజిటల్‌గా ఎడిట్ చేసి హైబ్రిడ్ జంతువలంటూ వ్యంగంగా పలు ఫోటోలను 2014లో షేర్ చేసాడు. ఈ ఫోటోలలో ఇప్పుడు వైరల్ అయిన మేకసీతకోక చిలుక ఫోటో కూడా ఉంది. ఇలానే వేరువేరు జంతువుల ఫోటోలను డిజిటల్‌గా ఎడిట్ చేసి, షేర్ చేసిన బ్లాగ్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
ఐతే ఇటీవల ఒక ఫేస్‌బుక్ వినియోగదారుడు ఈ ఫోటోని వ్యంగంగా షేర్ చేయగా, ఇది నిజం అనుకొని చాలా మంది దీనిని షేర్ చేయడం మొదలుపెట్టారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో దీనిని షేర్ చేసిన అతను, ఈ ఫోటో నిజం కాదని, గ్రాఫిక్స్ ద్వారా తయారు చేసిందని వివరణ ఇచ్చాడు, దీనిని షేర్ చేయడం ఆపండని కోరుతూ తన ఫేస్‌బుక్‌లో పలు సార్లు పోస్ట్ చేసాడు (ఇక్కడ మరియు ఇక్కడ). అయినా కూడా ఈ ఫోటోని నిజం అనుకొని షేర్ చేస్తూనే ఉన్నారు.
చివరగా, డిజిటల్‌గా తయారు చేసిన ఫోటోని నిజమైన మేకసీతకోక చిలుక అనుకోని షేర్ చేస్తున్నారు.