పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ (PMNRF) నుండి డబ్బులు ఇవ్వాలంటే కాంగ్రెస్ ప్రెసిడెంట్ పర్మిషన్ కావాలి, అందుకే తాజాగా కొరోనా విపత్తు నుండి దేశాన్ని కాపాడడానికి PMNRF ఫండ్ కి బదులుగా కొత్తగా పీఎం కేర్స్ (PM CARES) ఫండ్ ని తీసుకొని వచ్చారని చెప్తున్న ఒక యూట్యూబ్ వీడియోని (ఆర్కైవ్డ్) సోషల్ మీడియాలో చాలా మంది పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

క్లెయిమ్: పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ (PMNRF) నుండి డబ్బులు ఇవ్వాలంటే కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనుమతి కావాలి, అందుకే పీఎం కేర్స్ (PM CARES) ని తీసుకొని వచ్చారు.
ఫాక్ట్ (నిజం): PMNRF ని 1948 లో మొదలు పెట్టినప్పుడు మేనేజింగ్ కమిటీ లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ కి చోటు కలిపించారు, కానీ 1985 లో మేనేజింగ్ కమిటీ తీసేసి మొత్తం బాధ్యత ప్రధాని చేతికి ఇచ్చారు. ఇప్పుడు ఫండ్ ని ఎలా ఉపయోగించాలో నిర్ణయం మొత్తం ప్రధాని చేతుల్లో ఉంది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ (PMNRF) గురించి గూగుల్ లో వెతకగా, PMNRF వెబ్సైటు సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. PMNRF ఫండ్ ని 1948 లో మొదలు పెట్టారని, ఆ ఫండ్ ని మేనేజ్ చేసే కమిటీ లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ కి చోటు కలిపించారని తెలుస్తుంది.


అయితే, ఇప్పుడు మాత్రం ఆ ఫండ్ ని ఎలా ఉపయోగించాలో నిర్ణయం మొత్తం ప్రధాని చేతుల్లో ఉందని ఆ వెబ్సైటులో చూడవొచ్చు.
1985 లో మేనేజింగ్ కమిటీ తీసేసి మొత్తం బాధ్యత ప్రధాని చేతికి ఇచ్చారని ఒక ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ లో చదవొచ్చు.

PMNRF మరియు PM-CARES గురించి మరిన్ని వివరాల కోసం FACTLY రాసిన వివరమైన ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు.
చివరగా, PMNRF నుండి డబ్బులు ఇవ్వాలంటే కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనుమతి అవసరం లేదు. ఆ నిబంధనని 1985 లోనే తీసేసారు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?