Fake News, Telugu
 

‘బ్రిటిష్ ఎయిర్ వేస్’ తమ సంస్థను మూసివేస్తునట్టు ఎటువంటి ప్రకటన చేయలేదు

0

‘British Airways’ తమ విమానయాన సంస్థను మూసివేస్తునట్టు ప్రకటించింది, అంటూ షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో వ్యాఖ్యాత ఉద్యోగుల తరుపున ‘Good Bye and Thank You’ అని చెప్తుండటం మనం గమనించవొచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: British Airways’ తమ విమానయాన సంస్థను మూసివేస్తునట్టు ప్రకటించింది.

ఫాక్ట్ (నిజం): ఇటివల ‘British Airways’ తమ విమానయాన సంస్థలో పనిచేస్తున్న 350 మంది పైలట్లను తీసివేస్తునట్టు ప్రకటించింది. మొత్తం మీద ‘British Airways’ సంస్థ పన్నెండు వేల (12,000) ఉద్యోగాలు తొలగించే ఆస్కారం ఉందంటూ BBC తమ కథనంలో చెప్పింది. అంతేగాని సంస్థను పూర్తిగా మూసివేస్తునట్టు ‘British Airways’ఎక్కడా ప్రకటించలేదు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం ‘British Airways’ సంస్థ యొక్క అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ లో వెతకగా, పోస్టులో చెప్పిన వివరాలతో కూడిన ఎలాంటి వీడియో కూడా ‘British Airways’ సంస్థ పోస్ట్ చేయలేదని తెలిసింది. పోస్టులో చెప్పిన విషయానికి సంబంధించి ‘British Airways’ సంస్థ వెబ్సైటులో కూడా వెతకగా, అలాంటి ప్రకటన ఏది ఆ సంస్థ చెయ్యలేదు అని తెలిసింది.

పోస్టులో షేర్ చేసిన అదే వీడియో ‘13 June 2020’ నాడు ‘Unite the Union Yout’ అనే యూట్యూబ్ ఛానల్  ‘Thank You and Goodbye from the staff of British Airways’ అనే టైటిల్ తో  పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో కింద వివరణలో ‘British Airways’ సంస్థ ‘15 June 2020’ నుండి తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరిని తీసేయడానికి ధరఖాస్తు పంపించింది అంటూ రాసి ఉండటం చూడొచ్చు. BBC వార్త సంస్థ ‘13 June 2020’ నాడు ప్రచురించిన ఒక కథనంలో , ‘British Airways’ సంస్థలో పనిచేస్తున్న పన్నెండు వేల (12,000) ఉద్యోగులని ఆ సంస్థ తొలగించే ఆస్కారం ఉందంటూ రాసింది. ‘27 June 2020’ నాడు ‘The Sun’ అనే U.K కి సంబంధించిన పత్రిక రాసిన కథనంలో, ‘British Airways’ సంస్థ 350 మంది పైలట్లను తొలగించినట్టు, ఇంకో 300 మందికి సగం జీతం ఇస్తూ రిజర్వ్ లో ఉంచారని తెలిపింది. ‘British Airways’ తో పాటు దుబాయ్ కి చెందిన ‘Emirates’ మరియు జర్మనీకి చెందిన ‘Lufthansa’ విమానయాన సంస్థలు కూడా వారి ఉద్యోగులని తొలగించినట్టు తెలిపే ఆర్టికల్స్ మనం ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

‘British Airways’ సంస్థ ఇటివలే పోస్ట్ చేసిన ఓక వీడియోలో, కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ ముగియగానే తమ సంస్థ వినియోగదారుల ప్రయాణ సేవలకు సిద్దంగా ఉన్నట్టు ప్రకటించింది.

‘British Airways’ వెబ్సైటులో విమాన ప్రయాణాలకు సంబంధించిన బుకింగ్ స్లాట్స్ ఇంకా తెరుచుకొనే ఉన్నాయి. ఇటివలే ‘British Airways’ సంస్థ ఒకే వారంలో రెండు ‘Boeing 787-10’ విమానాల డెలివరీ కూడా తీసుకుంది. ఈ ఆధారాలతో  ‘British Airways’ సంస్థ తమ కార్యకలాపాలను మూసివేయడం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ‘British Airways’ విమానయాన సంస్థ ఎక్కడ కూడా తమ సంస్థను మూసివేస్తునట్టు ప్రకటించలేదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll