Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

ఫోటోలో ఉన్నది ఇటలీ అధ్యక్షుడు కాదు, బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో. అతను ఏడ్చింది కొరోనా వైరస్ వ్యాప్తి గురించి కాదు

0

ఒక ఫోటో ని ఫేస్బుక్ లో పెట్టి, అందులో ఉన్నది ఇటలీ అధ్యక్షుడు అని, ఆయన తమ దేశంలో కొరోనావైరస్ తో బాధ పడుతున్న రోగులను కాపాడలేకపోతున్నా అని నిస్సహాయతతో ఎడుస్తున్నాడని చెప్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తమ దేశంలో కొరోనా వైరస్ తో బాధ పడుతున్న రోగులను కాపాడలేకపోతున్నా అని నిస్సహాయతతో ఇటలీ అధ్యక్షుడు ఎడుస్తున్న ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఫోటోలో ఉన్నది ఇటలీ అధ్యక్షుడు కాదు, అతను బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో. ఆ ఫోటో ఒక ‘ఎవాంజెలికల్ థాంక్స్ గివింగ్ సర్వీస్’ కార్యక్రమంలో బోల్సోనారో పాల్గొన్నప్పుడు ఏడ్చినప్పటిది. ఇటలీ అధ్యక్షుడు తమ దేశంలో కొరోనావైరస్ తో బాధ పడుతున్న రోగులను కాపాడలేకపోతున్నా అని నిస్సహాయత వ్యక్తం చేయలేదు. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు.

ఇటలీ దేశంలో కొరోనావైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందడం తో అక్కడ వ్యాధి బారిన పడిన అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటివరకు ఆ దేశం లో 53 వేలకు పైగా COVID-19 కేసులు నమోదయ్యాయి మరియు 4,800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

పోస్టులోని ఫోటోని క్రాప్ చేసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అది ‘Poder360’ అనే వార్తా సంస్థ 17 డిసెంబర్ 2019 న ప్రచురించిన కథనం లో లభించింది. దాని ద్వారా, ఆ ఫోటో లో ఉన్నది బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో అని తెలుస్తుంది. దాని ప్రకారం, బోల్సోనారో ఒక ‘ఎవాంజెలికల్ థాంక్స్ గివింగ్ సర్వీస్’ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, 2018 ఎన్నికల ప్రచారంలో జూయిజ్ డి ఫోరా (ఎంజి) లో తాను కత్తి దాడికి గురైన సంఘటనని గుర్తుకు చేస్కుని కన్నీరు కార్చారు. కావున, ఫోటోలో ఉన్నది ఇటలీ అధ్యక్షుడు కాదు. అతను బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో.

ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మాటారెల్లా తమ దేశంలో కొరోనావైరస్ తో బాధ పడుతున్న రోగులను కాపాడలేకపోతున్నా అని అన్నారా అని సమాచారం కోసం వెతికినప్పుడు, దానిని దృవీకరిస్తూ విశ్వసనీయ వార్తా సంస్థలు ప్రచురించిన సమాచారమేమీ లభించలేదు. ప్రెసిడెన్సీ ఆఫ్ ఇటాలియన్ రిపబ్లిక్ అధికారిక ట్విట్టర్ ఖాతా లో చూసినప్పుడు కూడా, అలాంటి సమాచారమీమీ లభించలేదు. కావున, పోస్టులో పేర్కోనట్లుగా ఇటలీ అధ్యక్షుడు తమ దేశంలో కొరోనావైరస్ తో బాధ పడుతున్న రోగులను కాపాడలేకపోతున్నా అని నిస్సహాయతను తెలపలేదు.

చివరగా, ఫోటోలో ఉన్నది ఇటలీ అధ్యక్షుడు కాదు, అతను బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో. అంతేకాదు కొరోనా వైరస్ తో బాధ పడుతున్న తమ దేశస్థులను కాపాడలేకపోతున్నాం అని ఇటలీ అధ్యక్షుడు నిస్సహాయాతని వ్యక్తం చేయలేదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll