Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

జర్మనీ ‘ఆర్ట్ ప్రాజెక్ట్’ ఫోటో పెట్టి, ‘కొరోనా వల్ల ఇటలీ లో పిట్టల్లా రాలిపోయిన జనాలు’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

ఇటలీ లో ఏం జరుగుతుందో శాటిలైట్ చిత్రం ద్వారా చూడండి, పిట్టల రాలిపోయిన జనాలు చూడండి’ అని చెప్తూ ఒక ఫోటోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కొరోనా వైరస్ సోకి ఇటలీ దేశంలో పిట్టల్లా రాలిపోయిన జనాల ఫోటో.

ఫాక్ట్ (నిజం): పోస్టులోని ఫోటోకీ, తాజా కొరోనా వైరస్ మరణాలకు అసలు సంబంధం లేదు. కాట్జ్‌బాచ్ నాజీ నిర్బంధ శిబిర బాధితులను స్మరించుకుంటూ, ఫ్రాంక్ ఫుర్ట్ (జర్మనీ) లో చేపట్టిన ఒక ‘ఆర్ట్ ప్రాజెక్ట్’ లో భాగంగా, కొంతమంది వ్యక్తులు రోడ్డుపై పడుకున్నప్పటి ఫోటో. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్టులోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ‘South China Morning Post’ వార్తా సంస్థ యొక్క కథనం లో లభించింది. దానిని 2014 లో ప్రచురించినట్లుగా ఉంది మరియు అందులోని ఫోటోకి క్రెడిట్స్ ‘Reuters’ సంస్థ అని ఉంది. ‘Reuters’ వెబ్సైటు లో ఆ ఫోటో గురించి వెతికినప్పుడు అది లభించింది. ఆ ఫోటో గురించి ఉన్న వివరణ ద్వారా, అది కాట్జ్‌బాచ్ నాజీ నిర్బంధ శిబిర బాధితులను స్మరించుకుంటూ, ఫ్రాంక్ ఫుర్ట్ (జర్మనీ) లో చేపట్టిన ఒక ‘ఆర్ట్ ప్రాజెక్ట్’ లో భాగంగా, కొంతమంది వ్యక్తులు రోడ్డుపై పడుకున్నప్పుడు తీసిన ఫోటో అని తెలిసింది.

ప్రపంచంలో అందరికంటే ఎక్కువ కోవిడ్-19 మరణాలు ఇటలీలో నమోదు అయ్యాయి. కానీ, పోస్టులోని ఫోటోకీ, తాజా కొరోనా వైరస్ మరణాలకు అసలు సంబంధం లేదు. ఇంతకముందు కూడా ఇదే ఫోటో పెట్టి, చైనా లో కొరోనా వైరస్ వల్ల చనిపోయిన ప్రజలు అని షేర్ చేసినప్పుడు, అది తప్పు అని చెప్తూ FACTLY వారు రాసిన ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు

చివరగా, పోస్టులోని ఇమేజ్ ఇటలీ లో కొరోనా వైరస్ బారిన పడిన బాధితులది కాదు మరియు అక్కడ ఉన్నది శవాలు కాదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll