Fake News, Telugu
 

వై.యస్.జగన్‌ తనకు స్పూర్తి అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ పేర్కొనలేదు

0

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. జగన్‌ మొహన్ రెడ్డి  తనకు స్పూర్తి అని ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ పేర్కొన్నట్టు సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వై.యస్. జగన్‌ మొహన్ రెడ్డి  తనకు స్పూర్తి అని ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ పేర్కొన్నారు.

ఫాక్ట్ (నిజం): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వై.యస్. జగన్‌ మోహన్ రెడ్డితో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్‌కు మంచి స్నేహ బంధం ఉన్న మాట వాస్తవం. కానీ, వై. యస్. జగన్‌ మొహన్ రెడ్డి తనకు స్పూర్తి అని ఎం.కె. స్టాలిన్ ఎక్కడా పేర్కొనలేదు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం గుగూల్‌లో కి పదాలు ఉపయోగించి వెతికితే, వై.యస్. జగన్‌ మోహన్ రెడ్డి తనకు స్పూర్తి అని పేర్కొంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిసింది. ఒక వేళ ఎం.కె. స్టాలిన్ వై.యస్. జగన్‌కు సంబంధించి అలాంటి వ్యాఖ్యలు చేసి వుంటే, ఆ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసేవి. కాని, దీని గురుంచి రిపోర్ట్ చేస్తూ ఇంటెర్నెట్‌లో ఒక్క ఆర్టికల్ కూడా పబ్లిష్ అవలేదు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వై.యస్. జగన్‌ మొహన్ రెడ్డితో ఎం.కె. స్టాలిన్‌కు మంచి స్నేహ బంధం ఉన్న మాట వాస్తవం. 2019లో వై.యస్. జగన్‌ ప్రమణస్వీకార కార్యక్రమానికి ఎం.కె. స్టాలిన్‌ ముఖ్యఅతిధిగా వచ్చారు. ఈ కార్యక్రమంలో స్టాలిన్ మాట్లాడుతూ, “ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న వై.యస్. జగన్‌కి నా అభినందనలు. జగన్‌ తన తండ్రి (వై. యస్. రాజశేఖర్ రెడ్డి) వారసత్వాన్ని మరింత గర్వించే విధంగా చేస్తారని ఆశిస్తున్నాను”, అని తెలిపారు. జగన్‌కు సంబంధించి ఎం.కె. స్టాలిన్‌ పెట్టిన ట్వీట్లని ఇక్కడ చూడవచ్చు.  ఈ ట్వీట్లలో ఎక్కడా  వై.యస్. జగన్‌ తనకు స్పూర్తి అని ఎం.కె. స్టాలిన్‌ పేర్కొనలేదు.  

చివరగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. జగన్‌ తనకు స్పూర్తి అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll