Fake News, Telugu
 

సోనియా గాంధీ ని ఆంటోనియా మైనో అని ఎవరైనా పిలవచ్చని బొంబాయి హైకోర్టు తీర్పు ఇవ్వలేదు.

0

కాంగ్రెస్ లీడర్ సోనియా గాంధీ ని ఆంటోనియా మైనో అని ఎవరైనా పిలవచ్చు, అలా పిలవడం తప్పు కానే కాదు’ అని బొంబాయి హైకోర్టు తీర్పు ఇచ్చినట్టు చెప్తూ, ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: సోనియా గాంధీ ని ఆంటోనియా మైనో అని ఎవరైనా పిలవచ్చని బొంబాయి హైకోర్టు తీర్పు ఇచ్చింది. 

ఫాక్ట్ (నిజం): ):  మత విద్వేషాలను రెచ్చగోట్టాడని ఆరోపిస్తూ తన పై పెట్టిన FIRలను కొట్టేయమని బొంబాయి హైకోర్టులో అర్నబ్ గోస్వామి వేసిన అప్లికేషన్ పై కోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వలేదు. జూన్ 12 న జరిగిన వాదనలు తర్వాత, ఆర్డర్ రిజర్వు చేసామని, తాము తీర్పు ఇచ్చేవరకు జూన్ 9 న ఇచ్చిన మధ్యంతర ఆర్డర్ అమలులో ఉంటుందని బొంబాయి హైకోర్టు తెలిపింది. ఎక్కడా కూడా పోస్టులో చెప్పిన విషయాన్ని వారు చెప్పలేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్టులోని విషయం గురించి వెతకగా, అర్నబ్ గోస్వామి కేసు విషయంలో బొంబాయి హైకోర్టు తీర్పు ఇచ్చినట్టు ఎక్కడా కూడా సమాచారం లేదు. ఆ కేసు గురించి బొంబాయి హైకోర్టు వెబ్సైటులో వెతకగా, చివరగా జూన్ 12 న ఆ కేసు హియరింగ్ కి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే, ఆ రోజు వాదనలు విన్న తర్వాత, ఆర్డర్ రిజర్వు చేసామని, తాము తీర్పు ఇచ్చేవరకు జూన్ 9 న ఇచ్చిన మధ్యంతర ఆర్డర్ అమలులో ఉంటుందని బొంబాయి హైకోర్టు తెలిపినట్టు ఇక్కడ చూడవొచ్చు. ఎక్కడా కూడా పోస్టులో చెప్పిన విషయాన్ని వారు చెప్పలేదు. జూన్ 9 న ఇచ్చిన ఇంటరిమ్ ఆర్డర్ లో కూడా అలాంటిదేమీ కోర్టు చెప్పలేదని ఇక్కడ చూడవొచ్చు.

జూన్ 9 న మరియు జూన్ 12 న కోర్టులో జరిగిన వాదనలను ‘Live Law’ ఆర్టికల్స్ లో ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.

చివరగా, సోనియా గాంధీ ని ఆంటోనియా మైనో అని ఎవరైనా పిలవచ్చని బొంబాయి హైకోర్టు తీర్పు ఇవ్వలేదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll