
ఒక పార్కులో వ్యాయామ (జిమ్) పరికరం దానంతట అదే ఊగుతున్న వీడియో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, ఆ ఘటన రాత్రి 2 గంటల సమయంలో రోహిణి జపానీ అనే ఓ పార్కు (ఢిల్లీ) లో జరిగిందని, వీడియోలో వ్యాయామం చేస్తున్నది ఎవరు తేలియడం లేదని, దెయ్యాలున్నాయని నమ్ముతారా అని అడుగుతున్నారు. అయితే, FACTLY విశ్లేషణ లో ఆ వీడియో ని ఝాన్సీ (యూపీ) లోని కాశీరామ్ పార్క్ లో తీశారని తెలిసింది. అతిగా గ్రీస్ పెట్టి ఉన్న వ్యాయామ పరికరాన్ని తాకి వదిలేయడం వల్ల అది అలా కొంతసేపు కదులుతున్నట్లుగా ఝాన్సీ పోలీసుల నిర్ధారణలో తేలింది. ఝాన్సీ పోలీసులు మరొక ట్వీట్ లో పూర్తి వీడియో ని పెట్టారు. అందులో ఒక పోలీసు అధికారి వ్యాయామ పరికరాన్ని తాకి వదిలేసినప్పుడు, అది కొంతసేపు అలానే ఊగుతుండడం చూడవచ్చు.
సోర్సెస్:
క్లెయిమ్ – ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ –
1. ఝాన్సీ పోలీస్ ట్వీట్1 – https://twitter.com/jhansipolice/status/1271646518521413632
2. ఝాన్సీ పోలీస్ ట్వీట్2 – https://twitter.com/jhansipolice/status/1271701267232903168
Did you watch our new video?