Fake News, Telugu
 

బీజేపీ MLA సుధీర్ గాడ్గిల్ కారులో 20 వేల కోట్లు విలువైన కొత్త 2000 నోట్లు దొరకలేదు

0

20 వేల కోట్ల విలువ చేసే కొత్త 2000 రూపాయల నోట్లని బీజేపి MLA సుధీర్ గాడ్గిల్ కారులో పోలీసులు స్వాధీనం చేసుకున్నారంటూ రెండు ఫోటోలతో కూడిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 20 వేల కోట్లు విలువ చేసే కొత్త 2000 నోట్లని బీజేపీ MLA సుధీర్ గాడ్గిల్ కారులో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఒక ఫోటో మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లాలో 2016 లో జరిగిన రెయిడ్ కి సంబంధించినది. ఈ రెయిడ్ లో 6 కోట్ల విలువైన పాత కరెన్సీ నోట్లని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేయబడ్డ ఈ డబ్బులు, మహారాష్ట్ర  బీజేపీ MLA సుధీర్ గడ్గిల్ సోదరుడు గణేష్ గడ్గిల్ నడిపిస్తున్న సంగ్లి అర్బన్ బ్యాంకు కు చెందినవి. మరొక ఫోటోలోని కొత్త 2000 నోట్ల కట్టలు ఈ రెయిడ్ లో దొరికినవి కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

డబ్బుల సంచులు కలిగి ఉన్న కారుని పోలీసులు రెయిడ్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటో ‘ABP Maharashtra’ న్యూస్ సంస్థ 15 నవంబర్ 2016 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్ లో దొరికింది. 6 కోట్లు విలువైన పాత కరెన్సీ నోట్లని మహారాష్ట్ర పోలీసులు ఒక కారులో స్వాధీనం చేసుకున్నట్టు ఆర్టికల్ లో తెలిపారు. ఈ రెయిడ్ నవంబర్ 2016 లో చోటుచేసుకుంది. ఈ కారు మహారాష్ట్ర  బీజేపి MLA సుధీర్ గడ్గిల్ సోదరుడు గణేష్ గడ్గిల్ నడుపుతున్న సంగ్లి అర్బన్ బ్యాంకు కి చెందినదని ఆర్టికల్ లో రిపోర్ట్ చేసారు. మహారాష్ట్ర లో జరుగబోతున్న ఒక లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల కోసం ఈ డబ్బుని కారులో తీసుకెళ్తునట్టు పోలీసులు మీడియాకి తెలిపారు. ఈ డబ్బులు సుధీర్ గడ్గిల్ కి చెందినవే అని మనం అనుకున్నా, ఈ రైడ్ లో దొరికింది కేవలం 6 కోట్లు విలువైన పాత కరెన్సీ నోట్లు, 20 వేల కోట్ల విలువైన కొత్త కరెన్సీ నోట్లు కాదు.

పోస్టులో షేర్ చేసిన మరొక ఫోటోని ITరెయిడ్స్ జరిగినప్పుడు న్యూస్ సంస్థలు తమ ఆర్టికల్స్ లో రిఫరెన్స్ ఫోటోగా పబ్లిష్ చేసారు. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.  ఈ ఫోటోని ఒక యూసర్ 12 నవంబర్ 2016 నాడు ట్వీట్ చేసారు. ఈ ఫోటో ఎక్కడిది అని స్పష్టత లేనప్పటికీ, బీజేపి MLA సుధీర్ గడ్గిల్ సోదరుడి పై జరిగిన ఈ రెయిడ్ కు సంబంధించి కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, బీజేపీ MLA సుధీర్ గడ్గిల్ కి చెందిన కారులో పోలీసులు 6 కోట్ల విలువైన పాత కరెన్సీ నోట్లని స్వాధీనం చేసుకున్నారు, 20 వేల కోట్లు విలువైన కొత్త 2000  నోట్లు కాదు.

Share.

About Author

Comments are closed.

scroll