Fake News, Telugu
 

పోసాని కృష్ణ మురళి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించినట్లుగా ఎడిట్ చేసిన వీడియోని షేర్ చేస్తున్నారు

0

ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ “మీరొక అవినీతి పరుడని, మీరొక తార్పుడు గాడని, మీరు ఆడపిల్లల్ని వాడుకుని వదిలేస్తారని, ఇన్ని రకాల బాడ్ (చెడు అభిప్రాయం) ఉంది.”  అని విమర్శించినట్టుగా చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పోసాని కృష్ణ మురళి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్న దృశ్యాలు/

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో ఎడిట్ చేసినది. 20 ఫిబ్రవరి 2024న సాక్షి టీవీలో పోసాని మురళి కృష్ణ మాట్లాడిన వీడియోను, టైంస్టాంప్ 01.38 నుండి 01.42 వరకు మరియు టైంస్టాంప్ 2:13 నుండి 02:25 వరకు కట్ చేసి ఎడిట్ చేస్తూ ఈ వైరల్ వీడియో రూపొందించారు. వాస్తవంగా, పోసాని కృష్ణ మురళి చంద్రబాబు నాయుడును ఉదేశిస్తూ “పబ్లిక్ డొమైన్‌లో మీరొక అవినీతి పరుడని, మీరొక తార్పుడు గాడని, మీరు వెన్నుపోటు పొడుస్తారని, మీరు ఆడపిల్లల్ని వాడుకుని వదిలేస్తారని, ఇన్ని రకాల బాడ్ (చెడు అభిప్రాయం) ఉంది” అని అన్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకి సంబంధించిన  మరింత సమాచారం కోసం పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన పూర్తి నిడివి గల వీడియోని 20 ఫిబ్రవరి 2024న సాక్షి టీవీ (Sakshi TV live) తమ యూట్యూబ్ ఛానల్ లో “Posani Krishna Murali Mass Warning To Chandrababu Comments” అనే శీర్షికతో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. పూర్తి వీడియోను పరిశీలించగా, పోసాని చంద్రబాబు నాయుడుని విమర్శిస్తూ, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి అవుతాడని మాట్లాడారని తెలిసింది.

ఈ వీడియోని పూర్తిగా పరిశీలిస్తే, టైంస్టాంప్ 01.38 నుండి 01.42 వరకు మరియు టైంస్టాంప్ 2:13 నుండి 02:25 వరకు కట్ చేసి ఎడిట్ చేశారు. వాస్తవంగా, పోసాని కృష్ణ మురళి చంద్రబాబు నాయుడును ఉదేశిస్తూ “పబ్లిక్ డొమైన్‌లో మీరొక అవినీతి పరుడని, మీరొక తార్పుడు గాడని , మీరు వెన్నుపోటు పొడుస్తారని, మీరు ఆడపిల్లల్ని వాడుకుని వదిలేస్తారని, ఇన్ని రకాల బాడ్ (చెడు అభిప్రాయం) ఉంది”  అని అన్నారు. దీన్ని బట్టి అసలైన వీడియోను ఎడిట్ చేస్తూ పోసాని మురళి కృష్ణ , వైఎసార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉదేశిస్తూ ఈ మాటలు అన్నారు అని అర్ధం వచ్చేలా వైరల్ వీడియోని రూపొందించారు అని నిర్ధారించవచ్చు.

చివరగా, పోసాని కృష్ణ మురళి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించినట్లుగా ఎడిట్ చేసిన వీడియోని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll