Fake News, Telugu
 

ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఉత్తరప్రదేశ్ BJP నేత, హత్రాస్ రేప్ నిందితుని తండ్రి కాదు.

0

ఇటీవల ఉత్తరప్రదేశ్ లో ఒక దళిత మహిళ అత్యాచార కేసులో నిందితుడైన సందీప్ ఠాకూర్ తండ్రికి BJP నేతలతో సంబంధం ఉన్నదని చెప్తూ దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు షేర్ చేసిన  పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్ దళిత మహిళ అత్యాచార కేసులో నిందితుడైన సందీప్ ఠాకూర్ తండ్రికి BJP నేతలతో సంబంధం ఉంది. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు.

ఫాక్ట్(నిజం): పోస్టులో ఉన్న ఫొటోలో ఉన్న వ్యక్తి ప్రయాగ్ రాజ్ కి చెందిన BJP నేత, ఇతనిపై  అత్యాచారం కేసు రిజిస్టర్ అయింది , కానీ ఇతనికి హత్రాస్ రేప్ కి ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో ఉన్న ఫోటో స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా పోస్టులోని వ్యక్తి మోదీతో ఉన్న ఫోటోని ప్రచురించిన ఒక వార్తా కథనం మాకు కనిపించింది. ఈ  వార్తా కథనం ప్రకారం ఫొటోలో ఉన్న వ్యక్తి ప్రయాగ్ రాజ్ కి చెందిన BJP నేత శ్యామ్ ప్రకాష్ ద్వివేది, ఇతనిపై  అత్యాచారం కేసు రిజిస్టర్ అయిందని ఈ కథనం యొక్క సారాంశం. కానీ, ఇతను హత్రాస్ ఘటనలో నిందితుని తండ్రి కాదు. హత్రాస్ సంఘటనకి ఇతనికి సంబంధం లేదు.

ఇతని పేరుతో ఉన్న సోషల్ మీడియా అకౌంట్ల కోసం వెతకగా ఇతని ఫేస్బుక్ అకౌంట్లో యోగి ఆదిత్యనాథ్, రాజ్ నాథ్ సింగ్ వంటి BJP నేతలతో ఉన్న ఫోటోలు కనిపించాయి. అదే అకౌంట్ లో ఇతను ప్రయాగ్ రాజ్ BJP నేత అనే ఉంది. ఇతని ట్విట్టర్ అకౌంట్ ఇక్కడ చూడొచ్చు.

ఇంకా హత్రాస్ ఘటనలో నిందితుడు అయిన సందీప్ ఠాకూర్ తండ్రి మీడియాతో మాట్లాడిన వీడియో ఇక్కడ చూడొచ్చు.

ఇటీవలే ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో జరిగిన 19 ఏళ్ళ యువతి అత్యాచార కేసు నేపథ్యంలో పోస్టులో ఉన్న వార్త లాంటి తప్పుదోవ పట్టించే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా  షేర్ చేస్తున్నారు.

చివరగా, పోస్టులో ఉన్న ఫోటోలోని వ్యక్తి ప్రయాగ్ రాజ్ కి చెందిన BJP నేత శ్యామ్ ప్రకాష్ ద్వివేది, ఇతనికి హత్రాస్ లో జరిగిన ఘటనకి సంబంధం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll