సగం కాలిపోయి ఉన్న ఒక శవం ఫోటోని పోస్ట్ చేసి, ఆ ఫోటోలోని దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిందని చెప్తూ ఫేస్బుక్ లో కొందరు పోస్ట్ చేస్తున్నారు. కొందరు ఆ ఫోటోని ఉత్తరప్రదేశ్ లో జరిగిన హత్రాస్ (ఆర్కైవ్డ్), బల్రాంపూర్ (ఆర్కైవ్డ్) ఘటనలకు సంబంధించినట్టు పోస్ట్ చేస్తే, మరికొందరు రాజస్తాన్ (ఆర్కైవ్డ్) కి సంబంధించినట్టు పోస్ట్ చేసారు. ఆ పోస్టుల్లో ఎంతవరకు నిజముందో చూద్దాం
క్లెయిమ్ (దావా): ఈ సగం కాలిపోయిన శవం ఫోటో ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘటన కి సంబంధించింది.
ఫాక్ట్ (నిజం): పోస్టులోని ఫోటో ధార్ జిల్లా (మధ్యప్రదేశ్) లో జరిగిన ఒక మహిళ హత్య కి సంబంధించింది. గొడవల కారణంగా ఫోటోలోని మహిళని గోవింద్, సోహన్ అనే ఇద్దరు యువకులు చంపినట్టు ఆరోపించబడింది. కొందరు ఆ యువతిని రేప్ చేసి చంపారు అని పోస్ట్ చేసారు, కానీ ఆ హత్య పై నమోదు చేసిన FIR లో రేప్ ప్రస్తావన లేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అలాంటి ఫోటోలనే కొందరు ట్విట్టర్ లో పోస్ట్ చేసి, ఆ ఘటన ధార్ జిల్లా (మధ్యప్రదేశ్) లోని గంధ్వాని లో జరిగినట్టు రాసారు. కొన్ని సంబంధిత కీ-వర్డ్స్ తో ఇంటర్నెట్ లో వెతకగా, ఆ ఘటన పై ‘ఆసియానెట్ న్యూస్ – హిందీ’ వారు పోస్ట్ చేసిన వీడియో ఒకటి సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చింది. ఆ వీడియోలోని ఘటన ధార్ జిల్లా (మధ్యప్రదేశ్) లోని గంధ్వాని లో జరిగినట్టు వివరణలో చదవొచ్చు. గొడవ కారణంగా ఫోటోలోని మహిళని గోవింద్, సోహన్ అనే ఇద్దరు యువకులు చంపినట్టు ఆరోపించబడింది. ఆ ఘటన పై వివిధ వార్తాసంస్థలు ప్రచురించిన న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.
కొందరు ఆ యువతిని రేప్ చేసి చంపారు అని పోస్ట్ చేసారు, కానీ ఆ హత్య పై నమోదు చేసిన FIR లో రేప్ ప్రస్తావన లేదు. FIR లో కేవలం ఐపీసీ 302, 201 and 34 సెక్షన్లు ఉన్నట్టు ఇక్కడ చూడవొచ్చు.
చివరగా, పోస్ట్ లోని సగం కాలిపోయిన శవం ఫోటో మధ్యప్రదేశ్ లో జరిగిన ఒక మహిళ హత్య కి సంబంధించింది; ఉత్తరప్రదేశ్ , రాజస్తాన్ కి సంబంధించింది కాదు.