Fake News, Telugu
 

ఈ రోజు వరకైతే రిలయన్స్ సంస్థ జియో అనే బ్రాండ్ పేరుతో ఎటువంటి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడంలేదు

0

జియో అనే లోగో ఉన్న బ్యాగ్స్ లో గోధుమలు మొదలైన వ్యవసాయ ఉత్పత్తులు ప్యాక్ చేసిన ఫోటోలను షేర్ చేస్తూ కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల నిరసనలు ఇంకా ముగియక ముందే రిలయన్స్ జియో వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్లలోకి వచ్చేసాయి అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అంబానీ యొక్క జియో కంపెనీ బ్యాగ్స్ లో వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్ లోకి వచ్చిన ఫోటోలు.

ఫాక్ట్ (నిజం): ఈ రోజు వరకు రిలయన్స్ సంస్థ జియో అనే బ్రాండ్ పేరుతో ఎటువంటి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడంలేదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రిలయన్స్ సంస్థ జియో అనే బ్రాండ్ పై కేవలం డిజిటల్ సర్వీసెస్ మార్కెట్ చేస్తుంది, వ్యవసాయ ఉత్పత్తులు కాదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

రిలయన్స్ కి చెందిన జియో గోధుమలు, బియ్యం మొదలైన వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముతుందన్న దానికి సంబంధించి మాకు ఎటువంటి సమాచారం లభించలేదు. ‘రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)’ వెబ్సైటులో రిలయన్స్ కి చెందిన వివిధ బ్రాండ్స్ కి సంబంధించిన  లిస్టులో జియో పేరుతో వ్యవసాయ ఉత్పత్తులు బ్రాండ్ ఏది లేదు, ఈ వెబ్సైటులో ఉన్న సమాచారం ప్రకారం రిలయన్స్ సంస్థ జియో అనే బ్రాండ్ పై కేవలం డిజిటల్ సర్వీసెస్ మార్కెట్ చేస్తుంది, వ్యవసాయ ఉత్పత్తులు కాదు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క ‘Integrated Annual Report 2019-20’ లో ఉన్న రిటైల్ కిరాణా బ్రాండ్స్ లిస్టులో జియో అనే బ్రాండ్ లేదు. రిలయన్స్ యొక్క ప్రకటనల్లో కూడా ఎక్కడ జియో బియ్యం, జియో గోధుమలు లేక ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ప్రకటనలు లేవు.

పోస్టులో షేర్ చేసిన జియో బ్యాగ్స్ యొక్క ఫోటోల కోసం ఇంటర్నెట్ లో వెతకగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిన కొన్ని సంవత్సరాల ముందునుండే జియో లోగోతో ఉన్న బ్యాగ్స్ లో  బియ్యం మరియు గోధుమలు విక్రయిస్తున్న ఫోటోలు మాకు కనిపించాయి. ఈ లోగోస్ తో ఉన్న బ్యాగ్స్ ఫొటోస్ కొన్ని 2017లోనే షేర్ చేసారు.

ఇంకా ‘Udaan (B2B trading platform)’ వెబ్సైటులో చాలా మంది వర్తకులు తమ ఉత్పత్తులను జియో లోగోతో ఉన్న బ్యాగ్స్ లో అమ్ముతున్న ఫోటోలు చూడొచ్చు. IndiaMART వెబ్సైటు లో జియో లోగోస్ తో ఉన్న బ్యాగ్స్ ని ఒకతను విక్రయిస్తున్నాడు. ఐతే జియో లోగో అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ కి చెందినదే అయిన కొందరు వర్తకులు ఈ లోగోతో ఉన్న బ్యాగ్స్ లో తమ ఉత్పత్తులను మార్కెట్ చేసి విక్రయిస్తుండొచ్చు. ఈ లోగో అందరికి బాగా పరిచయం ఉన్నది కావడం వల్ల ఇది చేస్తుండొచ్చు. FACTLY ఈ విషయంపై స్పందన కోరుతూ RIL కి ఒక మెయిల్ రాయడం జరిగింది, వారినుండి బదులు రాగానే ఈ ఆర్టికల్ ని అప్డేట్ చేయడం జరుగుతుంది.

చివరగా, ఈ రోజు వరకు రిలయన్స్ సంస్థ జియో అనే బ్రాండ్ పేరుతో ఎటువంటి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడంలేదు.

Share.

About Author

Comments are closed.

scroll