Fake News, Telugu
 

ఇయర్ ఫోన్స్/హెడ్ సెట్ పెట్టుకుని వాహనం నడిపితే 20 వేలు ఫైన్ విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు తీసుకరాలేదు

0

ఇకపై డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్/హెడ్సెట్ పెట్టుకుంటే 20,000 జరిమానా విధించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందని ఒక వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ప్రభుత్వం దీనికి సంబంధించిన వివరాలు మొత్తం రవాణా శాఖకు జారీ చేసినట్లు కూడా ఈ పోస్టులో చెప్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇకపై డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్/హెడ్సెట్ పెట్టుకుంటే 20,000 రూపాయలు జరిమానా విధించేలా నిర్ణయం తీసుకుంది.

ఫాక్ట్(నిజం): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇయర్ ఫోన్స్/హెడ్ సెట్ పెట్టుకుని వాహనం నడిపితే 20 వేలు ఫైన్ విధిస్తూ ఎలాంటి నిబంధనలు తీసుకరాలేదు. ఇదే విషయం ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే విషయం గురించి అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమీషనర్‌ను ఫోన్ ద్వారా సంప్రదించగా ఈ వార్తలో నిజం లేదని అయన స్పష్టం చేసాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్/హెడ్సెట్ పెట్టుకుంటే 20000 జరిమానా విధించనుందని అన్ని ప్రధాన మీడియా సంస్థలు రిపోర్ట్ చేయడంతో ఈ వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యింది. tv9, NTV, News18, హిందుస్తాన్ టైమ్స్ తోపాటు ఇతర మీడియా సంస్థలు కూడా ఇదే వార్తను పబ్లిష్ చేసాయి.

ఐతే ఈ వార్తలో నిజం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదు. ఇదే విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. రాష్ట్ర రవాణా శాఖ ఇలాంటి నిబంధనలేమి పెట్టలేదని ఏపీ ఫాక్ట్-చెక్ ఒక ట్వీట్ ద్వారా తెలిపింది.

ఇదే విషయంపై వివరణ కోరుతూ మీము రాష్ట్ర అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమీషనర్‌ను ఫోన్ ద్వారా సంప్రదించగా ఈ వార్తలో నిజం లేదని అయన స్పష్టం చేసాడు.

చివరగా, ఇయర్ ఫోన్స్/హెడ్ సెట్ పెట్టుకుని వాహనం నడిపితే 20 వేల రూపాయల ఫైన్ విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు తీసుకరాలేదు.

Share.

About Author

Comments are closed.

scroll