Fake News, Telugu
 

ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీ నాయకుడు పోలీస్‌ని కొడుతున్న పాత వీడియోని వైసీపీ నాయకుడికి ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు

0

“వైసీపీ నాయకులు చేసే అరాచకాలు” అని క్లెయిమ్ చేస్తూ ఒక వ్యక్తి ఒక పోలీసుని కొడుతున్న వీడియోని (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఆ క్లెయిమ్‌లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం. 

క్లెయిమ్: వైసీపీ నాయకుడు ఒక పోలీసుని కొడుతున్న వీడియో. 

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో పోలీసుని కొడుతున్నది వైసీపీ నాయకుడు కాదు. ఈ సంఘటన 2018లో మీరట్ లో జరిగింది. వీడియోలో పోలీసుని కొడుతున్నది బీజేపీ కౌన్సిలర్, మనీష్ చౌదరి. ఈయన హోటల్‌లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ తన లాయర్ ఫ్రెండ్ తో వచినప్పుడు సర్వీస్ ఆలస్యం అయ్యిందని అక్కడ సిబ్బందికి వీరికి మధ్య జరిగిన గొడవలో మనీష్ చౌదరి సబ్ ఇన్స్పెక్టర్‌ని కొట్టాడు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.  

వైరల్ అవుతున్న వీడియోకి సంబందించిన కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే 20 అక్టోబర్ 2018న ప్రచురించిన కథనం లభించింది.  దాని ప్రకారం, ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ లో ఒక బీజేపీ కౌన్సిలర్ మరియు ఒక సబ్ ఇన్స్పెక్టర్ మధ్య చోటు చేసుకుంది అని తెలిసింది.

ఈ సమాచారంతో ఇంటర్నెట్‌లో వెతికితే మరిన్ని కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ). ఈ కథనాల ప్రకారం ఆ బీజేపీ కౌన్సిలర్ పేరు మనీష్ చౌదరి అని, ఈయన హోటల్‌కి సబ్ ఇన్స్పెక్టర్ పన్వార్ తన లాయర్ ఫ్రెండ్‌తో వచినప్పుడు సర్వీస్ ఆలస్యం అవడంతో వీరికి అక్కడ సిబ్బందికి మధ్య జరిగిన గొడవలో మనీష్ చౌదరి సబ్ ఇన్స్పెక్టర్‌ని కొట్టాడు అని తెలిసింది. పోలీసులు బీజేపీ కౌన్సిలర్ మనీష్ చౌదరిని అరెస్ట్ చేసినట్టు ANI వారు చేసిన ట్వీట్ లో  చూడవచ్చు.

చివరగా, ఉత్తర్ ప్రదేశ్ లో ఒక బీజేపీ నాయకుడు పోలీస్‌ని కొడుతున్న పాత వీడియోని వైసీపీ నాయకుడికి ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll