Fake News, Telugu
 

యాంటీ ట్యాంక్ మిస్సైల్స్ కాన్సెప్టును చూపిస్తున్న యానిమేటెడ్ వీడియోను, ఇజ్రాయెల్ యొక్క మిలిటరీ ఇంటెలిజెన్స్ వీడియో అంటూ షేర్ చేస్తున్నారు

0

“ఈ వీడియో ఇజ్రాయెల్ యొక్క మిలిటరీ ఇంటెలిజెన్స్ చూపిస్తుంది” అంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో (ఇక్కడ మరియు ఇక్కడ) షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

ఆర్కైవ్ చేసిన పోస్టును ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఈ వీడియో ఇజ్రాయెల్ యొక్క మిలిటరీ ఇంటెలిజెన్స్ చూపిస్తుంది. 

ఫాక్ట్(నిజం): ఈ వీడియోను 2016లో ‘Zichoe’ అనే యూట్యూబ్ ఛానల్లో ‘ఇది రష్యా యొక్క ఇన్వెంటర్, సెమెనోవ్ దాహిర్ కుర్మాన్‌బీవిచ్ రూపొందించిన కొత్త రహస్య ఆయుధం. ఇది US, ఇజ్రాయెల్ మరియు రష్యన్ ట్యాంకులను ధ్వంసం చేసినట్లు ప్రదర్శిస్తోంది’ అంటూ షేర్ చెయ్యబడింది. ఇదే వీడియో దహిర్ ఇన్సాట్ యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్రోడక్ట్ నంబర్ 1 అనే శీర్షికతో 2016లో షేర్ చెయ్యబడింది.  దాహీర్ ఇన్సాట్ ఇంజనీరింగ్ కంపెనీ యొక్క డైరెక్టర్ దాహిర్ సెమెనోవ్ తన ఫేస్బుక్‌ పేజిలో ‘Mining from aircraft and intelligent anti-tank weapons’ అంటూ షేర్ చేసారు. ఎక్కడా కూడా  ఇది ఇజ్రాయెల్ మిలిటరీకి సంబంధించిందని పేర్కొనలేదు. కావున, పోస్టులో చెయ్యబడ్డ క్లెయిమ్ తప్పు. 

ఈ వీడియో యొక్క కీ ఫ్రేములను ఉపయోగిస్తూ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా, ఈ వీడియోను 2016లో ‘Zichoe’ అనే యూట్యూబ్ ఛానల్ ప్రచురించటం మేము గమనించాం. సెమెనోవ్ దాహిర్ కుర్మాన్‌బీవిచ్ పేరును వైరల్ వీడియో యొక్క వాటర్ మర్క్‌గా కూడా ఉండటం మేము గమనించాం. అయితే ఈ వీడియో యొక్క వివరణ ప్రకారం ‘ఇది రష్యా యొక్క ఇన్వెంటర్, సెమెనోవ్ దాహిర్ కుర్మాన్‌బీవిచ్ రూపొందించిన కొత్త రహస్య ఆయుధం. ఇది US, ఇజ్రాయెల్ మరియు రష్యన్ ట్యాంకులను ధ్వంసం చేసినట్లు ప్రదర్శిస్తోంది (అనువదించబడింది)’ అని పేర్కొంది. పైగా వివరణలో సెమెనోవ్ దాహిర్ కుర్మాన్‌బీవిచ్ యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఇదే వీడియో యొక్క లింక్ ఇవ్వబడింది.

ఈ వీడియోను దహిర్ ఇన్సాట్ యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్రోడక్ట్ నంబర్ 1 అనే శీర్షికతో 2016లో షేర్ చెయ్యబడింది. దాహీర్ ఇన్సాట్ యూట్యూబ్ చాన్నెల్లో షేర్ చెయ్యబడ్డ ఇటువంటి మరిన్ని వీడియోలు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

దాహిర్ ఇన్సాట్ గురించి వెతికితే ఇది ఇస్తాంబుల్‌లోని ఒక ఇంజనీరింగ్ కంపెనీ అని, దీని డైరెక్టర్ ఇస్తాంబుల్ వాసి అయిన దాహిర్ సెమెనోవ్ అని కనుగొన్నాం. ఇదే వీడియోను దాహిర్ సెమెనోవ్ తన ఫేస్బుక్‌ పేజిలో ‘Mining from aircraft and intelligent anti-tank weapons’ అంటూ షేర్ చేసారు.

ఈ వీడియో డైలీ మోషన్  2015లో ‘ఇది దహిర్ ఇన్సాత్ యొక్క టాప్ డౌన్ యాంటీ ట్యాంక్ మిస్సైల్స్ కాన్సెప్ట్’ అని ప్రచురించింది. ఎక్కడా కూడా  ఇది ఇజ్రాయెల్ మిలిటరీకి సంబంధించిందని పేర్కొనలేదు. 

చివరిగా, యాంటీ ట్యాంక్ మిస్సైల్స్ కాన్సెప్టును చూపిస్తున్న అనిమటెడ్ వీడియోను, ‘ఇది ఇజ్రాయెల్ యొక్క మిలిటరీ ఇంటెలిజెన్స్ చూపిస్తుంది’ అంటూ షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll