కోవిడ్‌కి కారణం నెహ్రునే అని, 1962 లో చైనాతో నెహ్రు యుద్ధం చేయకపోయుంటే కరోనా వచ్చేది కాదని, అప్పటి కోపంతో చైనా భారత్ ను లక్ష్యంగా చేసుకొని కరోనా వైరస్ ను సృష్టించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారని ఒక పోస్ట్ ద్వారా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులొ ఎంత నిజముందో చూదాం.
క్లెయిమ్: కోవిడ్ కు కారణం నెహ్రూ నే అని చెప్పిన అమిత్ షా.
ఫాక్ట్: కోవిడ్ కు కారణం నెహ్రూ నే అని అమిత్ షా అన్నట్టు ఏ న్యూస్ ఆర్టికల్స్ మాకు దొరకలేదు. నిజంగానే అమిత్ షా అటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, అన్ని ప్రముఖ వార్త సంస్థలు కథనాలు ప్రచురించేవి. గతంలో, అమిత్ షా నెహ్రూని దేశ విభజన మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ యొక్క ఉనికి గురించి నిందించటం జరిగింది, కోవిడ్-19 మీద కాదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.
కేంద్ర మంత్రి అమిత్ షా కోవిడ్-19 కు సంబంధించి ఎవరినీ నిందించినట్టు మాకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. నిజంగానే అమిత్ షా అటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, అన్ని ప్రముఖ వార్త సంస్థలు కథనాలు ప్రచురించేవి. కావున, కోవిడ్-19 కు కారణం నెహ్రూ అని అమిత్ షా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని మనం అర్థం చేసుకోవొచ్చు. కానీ, అమిత్ షా గతంలో నెహ్రూని కొన్ని విషయాల్లో నిందించటం జరిగింది.
2018లో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, 1947 లో జరిగిన దేశ విభజన నెహ్రూ మూలానే అయింది అని అమిత్ షా అన్నారు. దానికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ ఇక్కడ చూడొచ్చు.
2019 లో ఇంకో కార్యక్రమంలో మాట్లాడుతూ, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ యొక్క ఉనికికి కూడా నెహ్రూ కారణం అని వ్యాఖ్యానించారు. అంతే కాదు, కాశ్మీర్ విషయాన్ని ఐక్యరాజ్యసమితికి తీసుకెళ్లటం నెహ్రూ ‘హిమాలయన్ మిస్టేక్’ అని అభివర్ణించారు. దానికి సంబంధించి ఆర్టికల్ ఇక్కడ చూడొచ్చు. కావున, ఈ విషయాల గురించి మాత్రమే అమిత్ షా నెహ్రూ ని నిందించారు అని అర్థం చేసుకోవొచ్చు, కోవిడ్-19 మీద కాదు.
చివరగా, కోవిడ్ కు కారణం నెహ్రూ అని అమిత్ షా అనలేదు.