Coronavirus Telugu, Fake News, Telugu
 

పోలియో తరహాలో ప్రజల ఇంటి వద్దకు వచ్చి వాక్సినేషన్ అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించలేదు

0

పల్స్ పోలియో తరహాలో ప్రజల ఇంటివద్దకే వెళ్లి కరోనా వ్యాక్సిన్ అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. కరోనా కట్టడి కొరకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం ఇదని ఈ పోస్టులో తెలిపారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పల్స్ పోలియో తరహాలో ప్రజల ఇంటివద్దకే వెళ్లి కరోనా వాక్సిన్ అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో తెలిపిన ఈ సమాచారాన్ని మొట్టమొదటగా ‘దిశా’ న్యూస్ సంస్థ  రిపోర్ట్ చేస్తూ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. తెలంగాణ ప్రజలకి కరోనా వాక్సిన్ ఉచితంగా అందిస్తున్నట్టు కేసీఆర్ ప్రభుత్వం ఇటివల ప్రకటించింది. కానీ, వైద్య సిబ్బంది ప్రజల ఇంటివద్దకు వెళ్లి వాక్సినేషన్ అందిస్తారని తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ ప్రకటించలేదు. దీనికి సంబంధించి ‘Telangana CMO’ ఆఫీస్ కూడా ఎటువంటి ట్వీట్ పెట్టలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేదిగా ఉంది.

పోస్టులో చేసిన క్లెయిమ్ కి సంబంధించిన వివరాల కోసం గూగుల్ లో వెతికితే, ఈ విషయాన్నీ మొదటగా రిపోర్ట్ చేస్తూ ‘దిశా’ న్యూస్ సంస్థ ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. కరోనా వాక్సిన్ కోసం ప్రజలు రానవసరం లేకుండా వైద్య సిబ్బందే వారి దగ్గరికి వెళ్లి వాక్సిన్ అందించే దిశగా కేసీఆర్ ప్రభుత్వం యోచిస్తున్నట్టు ఈ ఆర్టికల్ రిపోర్ట్ చేసింది. ‘పల్స్ పోలియో’ కార్యక్రమం అమలు తరహాలోనే కరోనా వ్యాక్సినేషన్ కూడా అమలు చేయాలనీ కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు ఈ ఆర్టికల్ లో తెలిపారు. మే 1వ తేదీ నుంచి 18-44 మధ్య వయసు వారు కూడా వ్యాక్సినేషన్ పొందవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, టీకా కేంద్రాల దగ్గర రద్దీ ఏర్పడకూడదనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ‘దిశా’ దిన పత్రిక మొదటి పేజిలో పబ్లిష్ అయిన ఈ న్యూస్ ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు.

‘దిశా’ న్యూస్ సంస్థ రిపోర్ట్ చేసిన ఈ సమాచారాన్ని దృవికరించడం కోసం తెలంగాణ ప్రభుత్వం అధికారిక వెబ్సైటులో వెతకగా, తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్నీ ప్రకటిస్తూ ఎటువంటి ప్రెస్ రిలీజ్ జారి చేయలేదని తెలిసింది. తెలంగాణ ప్రజలకి కరోనా వాక్సిన్ ఉచితంగా అందించనున్నట్టు కెసిఆర్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. కానీ, వైద్య సిబ్బంది ప్రజల ఇంటివద్దకు వెళ్లి  వాక్సిన్ అందిస్తారని తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి ప్రెస్ రిలీజ్ జారీ చేయలేదు. దీనికి సంబంధించి ‘Telangana CMO’ ఆఫీస్ కూడా ఎటువంటి ట్వీట్ చేయలేదు. ఈ వివరాల ఆధారంగా ‘దిశా’ న్యూస్ సంస్థ పబ్లిష్ చేసిన ఆర్టికల్ నిరాధారమైందని చెప్పవచ్చు.

చివరగా, తెలంగాణ ప్రజల ఇంటివద్దకు వెళ్లి వాక్సినేషన్ అందిస్తామని కేసీఆర్ ప్రభుత్వం  ఎటువంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదు.

Share.

About Author

Comments are closed.

scroll