Fake News, Telugu
 

2014 లో జరిగిన బీజేపీ నేషనల్ కౌన్సిల్ మీటింగ్ లో అమిత్ షా అద్వానీని అగౌరవపరచలేదు

0

ప్రధాని నరేంద్ర మోడీ మరియు అమిత్ షా కుర్చుని ఉండగా అద్వానీ నిల్చుని ఉన్న ఫోటో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, అమిత్ షా అద్వానీతో ‘వెనకాల కుర్చీ ఖాళీగా ఉంటే కూర్చో పో..’ అని చేతిని ఆ దిశలో చూపిస్తున్నాడని పేర్కొంటున్నారు. కానీ FACTLY విశ్లేషణ లో ఆ ఫోటో గురించి చెప్పింది తప్పని తేలింది. ఫోటో బీజేపీ నేషనల్ కౌన్సిల్ మీట్-2014 సందర్భం లో తీసింది. ఆ కార్యక్రమం యొక్క పూర్తి వీడియో ని చూసినట్లయితే  అమిత్ షా అద్వానీని కుర్చీలో ఉండి ప్రసంగించమని కోరినప్పుడు ఆయన పోడియం నుండి ప్రసింగిస్తాను అని తెలిపినట్లుగా అర్ధం అవుతుంది. అప్పుడు అద్వానీ లేచి నిలుచోగా, అమిత్ షా పోడియం ఉన్న దిశను  చూపిస్తారు. ఆ విజువల్స్ ని ఆ వీడియో లో 21:30 నుండి చూడచ్చు.

సోర్సెస్:
క్లెయిమ్ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్
1. యూట్యూబ్ వీడియో – https://youtu.be/Kt13WT7aoLE?t=1290

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll