Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

వీడియోలో జనం క్యూ కట్టింది మద్యం కోసం కాదు, తమ స్వరాష్ట్రాలకు వెళ్ళడానికి పర్మిషన్ కోసం

0

‘హైదరబాద్ గచ్చిబౌలిలో మద్యం కోసం వైన్ షాపు ముందు క్యూ కట్టిన జనం’ అని చెప్తూ, ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: హైదరాబాద్ గచ్చిబౌలిలో మద్యం కోసం వైన్ షాపు ముందు జనం క్యూ కట్టిన వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియోలో క్యూ కట్టింది మందు కోసం కాదు. అసలు వీడియో తీసిన ప్రదేశంలో వైన్ షాపే లేదు. ఆ వీడియోలో కనిపిస్తున్నవారు వలస కూలీలు; తమను తమ స్వరాష్ట్రాలకు పపించమని కోరుతూ గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ ముందు క్యూ కట్టారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు. 

వీడియోలో మొదట్లో కనిపించే బిల్డింగ్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ అని FACTLY విశ్లేషణలో తేలింది.

వీడియో తీసింది గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గర అని తెలిసింది కాబట్టి, కొన్ని కీ-వర్డ్స్ తో సెర్చ్ చేయగా, ‘TV5 News’ వీడియో ఒకటి సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. పోస్ట్ లోని వీడియోనే పెట్టి, ‘స్వరాష్ట్రాలకు పంపాల్సిందిగా కోరుతూ పోలీస్ స్టేషన్ల ముందు క్యూ. గచ్చిబౌలి పీఎస్ కు తరలివచ్చిన వేలాది మంది వలసకూలీలు’ అని న్యూస్ రాసినట్టు చూడవొచ్చు. కావున, ఆ వీడియో వైన్ షాపుల ముందు క్యూ కట్టిన జనాలది కాదు.

అంతేకాదు, వీడియోలో చూపెట్టిన ప్రదేశంలో అసలు వైన్ షాపులే లేనట్టు గూగుల్ మాప్స్ లో చూడవొచ్చు. కొన్ని ఉన్నా, అవి వీడియోలో నిలబడ్డ క్యూ కి వెనకాల ఉన్నాయి.

చివరగా, వీడియోలో జనం క్యూ కట్టింది మందు కోసం కాదు, తమ స్వరాష్ట్రాలకు వెళ్ళడానికి పర్మిషన్ కోసం.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll