Fake News, Telugu
 

ఈ పోస్టులో పేర్కొన్న అన్ని ప్రపంచ దేశాలు తమ ప్రజలకి కరోనా వాక్సిన్లని ని ఉచితంగా అందిస్తున్నాయి

0

ప్రపంచ దేశాలలో కరోనా వాక్సిన్ ధరలని తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. భారత దేశంలో రూపొందించిన కరోనా వాక్సిన్ ప్రపంచంలోనే ఉత్తమమైందని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ప్రపంచంలోని వివిధ దేశాలలో కరోనా వాక్సిన్ ధరలు.

ఫాక్ట్ (నిజం): ఈ పోస్టులో తెలిపిన వివిధ దేశాల ప్రభుత్వాలు, తమ ప్రజలకి కరోనా వాక్సిన్ ని ఉచితంగా అందిస్తున్నాయి. భారత ప్రభుత్వం కూడా ఇక్కడి ప్రజలకు కరోనా వాక్సిన్ ని పబ్లిక్ హెల్త్ కేర్ సెంటర్లలో ఉచితంగా అందిస్తుంది. భారత ప్రభుత్వం ఇచ్చిన  ప్రెస్ రిలీజ్ లో ప్రైవేటు హాస్పిటల్స్ కరోనా వాక్సిన్ ఒక్క డోస్ కి 250 రూపాయలకు ఛార్జ్ చేసుకోవచ్చని ప్రకటించింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

అమెరికా:

U.S. Department of Health & Human Services 11 ఫిబ్రవరి 2021 నాడు ఇచ్చిన ప్రెస్ రిలీజ్ లో, జో బిడెన్ ప్రభుత్వం Pfizer కంపెనీ నుండి అదనపు కోవిడ్-19 వాక్సిన్లు కొనుగోలు చేస్తునట్టు తెలిపింది. అమెరికా  ప్రభుత్వం ఈ వాక్సిన్లని ప్రజలకు ఉచితంగా అందిస్తున్నట్టు ప్రెస్ రిలీజ్ లో ప్రకటించారు. ‘Vaccine administration costs for private-sector administration partners are being covered by healthcare payers: private insurance, Medicare or Medicaid, and an HHS program to cover COVID-19 costs for the uninsured which is reimbursing providers at Medicare rates from the Provider Relief Fund’ అని ఈ ప్రెస్ రిలీజ్ లో తెలిపారు.  

CDC (Centers for Disease Control and Prevention) ఇచ్చిన ప్రెస్ రిలీజ్ లో కూడా అమెరికా ఫెడరల్ ప్రభుత్వం తమ ప్రజలకి కరోనా వాక్సిన్లని ఉచితంగా అందిస్తునట్టు తెలిపారు.  ఈ వాక్సిన్ అందిస్తున్న సంస్థలకి అమెరికా Health Resources and Services Administration’s Provider Relief Fund  ద్వారా డబ్బులు రీయింబర్స్‌మెంట్ చేయబడుతాయని ఈ ప్రెస్ రిలీజ్ లో తెలిపారు. మర్చి 2020 లో పాస్ చేసిన Coronavirus Aid, Relief, and Economic Security (CARES) Act లో కూడా ఇదే తెలిపారు.

ఐరోపా:

European Commission వెబ్సైటులో తెలిపిన సమాచారం ప్రకారం, ఐరోపా లోని చాలా దేశాలు తమ ప్రజలకు కరోనా వాక్సిన్లని ఉచితంగా అందిస్తునట్టు తెలిపారు.

చైనా:

చైనా నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపిన సమాచారం ప్రకారం చైనా ప్రభుత్వం అక్కడి ప్రజలకి కరోనా వాక్సిన్లని ఉచితంగా అందిస్తుంది.

భారత దేశం:

CO-WIN 2.0 వెబ్సైటులో Ministry of Health and Family Welfare ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం, భారత దేశంలో నివసిస్తున్న ప్రజలకి ప్రభుత్వం కరోనా వాక్సిన్లని ప్రభుత్వ హెల్త్ కేర్ సెంటర్లలో ఉచితంగా అందిస్తునట్టు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రిలో కరోన వాక్సిన్ ధరలని భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుందని ఈ వెబ్సైటులో తెలిపారు.  

Ministry of Health and Family Welfare ఇచ్చిన ప్రెస్ రిలీజ్ ని PIB రిపోర్ట్ చేస్తూ, దేశంలో కొవిడ్ వాక్సినేషన్ సెంటర్ (CVC) అర్హత పొందిన ప్రైవేటు ఆసుపత్రులు ఒక్కో డోస్ కి 250 రూపాయలు ఛార్జ్ చేసుకోవచ్చని తెలిపింది.

బ్రెజిల్, రష్యా మరియు సౌదీ అరేబియా:

బ్రెజిల్, రష్యా మరియు సౌదీ అరేబియా దేశాలు తమ ప్రజలకి ఉచితంగా కరోనా వాక్సిన్ అందిస్తునట్టు చాలా అంతర్జాతీయ వార్త సంస్థలు రిపోర్ట్ చేసాయి.

కరోనా వాక్సిన్ ని తయారు చేసిన సంస్థలు తమ వాక్సిన్లని వివిధ దేశాలకు వేర్వేరు ధరలకు అమ్ముతున్నప్పటికీ, ఆ దేశాలు తమ ప్రజలకి కరోనా వాక్సిన్లని ఉచితంగా అందిస్తున్నాయి.

భారత ప్రభుత్వం 60 సంవత్సరాలు పై వయసు కలిగిన వారికి మరియు 45 నుండి 59 సంవత్సరాలు మధ్య వయసు ఉన్నవారికి కొన్ని నియమాలతో  కోవిడ్-19 వాక్సిన్లని ని అందించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ పోస్టులు షేర్ అవుతున్నాయి.

చివరగా, ఈ పోస్టులో తెలిపిన అన్ని దేశాలు తమ ప్రజలకి కరోనా వాక్సిన్ ని ఉచితంగా అందిస్తున్నాయి.

Share.

About Author

Comments are closed.

scroll