22 వ తేదీ వరకు ఫోన్ లో ఏదైనా మిస్డ్ కాల్ వస్తే తిరిగి కాల్ చేయవద్దని ముస్లింలందరికీ మౌలానా అర్షద్ మదాని విజ్ఞప్తి చేసారని, సిఏఏ పై సుప్రీంకోర్టు 22న తీర్పు ఇచ్చిందని, కాబట్టి బీజేపీ దీనికి మద్దతుగా ఆధారాలు సేకరిస్తోందని ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: 22వ తేదీ వరకు మిస్డ్ కాల్ వస్తే తిరిగి కాల్ చేయొద్దని ముస్లింలందరికీ మౌలానా అర్షద్ మదాని విజ్ఞప్తి.
ఫాక్ట్: యూట్యూబ్ వీడియో ద్వారా మరియు దైనిక్ భాస్కర్ వారి ఫాక్ట్ చెక్ ఆర్టికల్ ద్వారా 22వ తేదీ వరకు ఫోన్ లో ఏదైనా మిస్డ్ కాల్ వస్తే తిరిగి కాల్ చేయవద్దని ముస్లింలందరికి మౌలానా అర్షద్ మదాని విజ్ఞప్తి చేశారన్నది ఫేక్ అని తెలుస్తుంది. సిఏఏ పై సుప్రీంకోర్టు ఇప్పటివరకు తీర్పు ఇవ్వలేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.
సిఏఏ, ముస్లింలు మరియు అర్షద్ మదాని అని కీ వర్డ్స్ తో గూగుల్ లో సెర్చ్ చేసినప్పుడు ఒక యూట్యూబ్ వీడియో లభించింది. ‘మౌలానా అర్షద్ మదానీ సాహబ్ కి తరాఫ్ సిఎఎ కే ముతల్లిక్ ఫేక్ మెసేజ్ కి హకీఖత్ మౌలానా కి జుబానీ’ అనే టైటిల్ తో ఆ వీడియోలో, ఎలా 22వ తేదీ వరకు మిస్డ్ కాల్ వస్తే తిరిగి కాల్ చేయొద్దని ఫేక్ మెసేజ్ లు స్ప్రెడ్ చేస్తున్నారని, అర్షద్ మదాని పేరు పెట్టి తప్పుగా షేర్ చేస్తున్నారని ఈ వీడియో ద్వారా తెలిపారు.
ఈ వీడియోని క్లూగా తీసుకొని గూగుల్ లో ‘సిఏఏ ఫేక్ మెసేజ్ అర్షద్ మదాని’ అని వెతికినప్పుడు దైనిక్ భాస్కర్ వారి న్యూస్ ఆర్టికల్ లభించింది. ఆ ఆర్టికల్ 03 జనువరి 2020 లో పబ్లిష్ చేసారు, సిఏఏ కు సంబంధించి ఇటువంటి తప్పుడు మెసేజ్ లు సోషల్ మీడియాలో అప్పటినుంచే షేర్ చేస్తున్నట్టు తెలిపారు. ఇంకా, అర్షద్ మదాని ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు.
సిఏఏ కు సంభందించి సుప్రీంకోర్టు ఇంతవరకు తీర్పు ఇవ్వలేదు. పౌరసత్వ (సవరణ) చట్టాన్ని పార్లమెంటు 11 డిసెంబర్ 2019న ఆమోదించినప్పటి నుండి, దేశవ్యాప్తంగా నిరసనలతో పాటు కొంతమంది కొత్త చట్టాన్ని దాదాపు వెంటనే కోర్టుల్లో సవాలు చేశారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయుఎంఎల్) సిఏఏ చట్టం ఆమోదించిన మరుసటి రోజు సుప్రీంకోర్టులో దానిపై పిటిషన్ దాఖలు చేసింది అని, ప్రస్తుతం 140 పిటిషన్ లు అటాచ్ చేసారని తెలిసింది. అయితే ఆ పిటిషన్లులో ఇప్పటి వరకు పెద్దగా కదలికను చూడలేదు అని, ఈ కేసు మూడుసార్లు సుప్రీంకోర్టు ముందు వచ్చిందని ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరో ఆర్టికల్ ఇక్కడ చూడొచ్చు.
అయితే మౌలానా లకు సంబంధించి ఇంతకముందు కూడా కొన్ని విషయాల్లో తప్పుగా షేర్ చేసారు, తెలంగాణా లో మున్సిపల్ ఎన్నికల సమయంలో నోటా కు వోట్ వేయమని చెప్పారంటూ షేర్ చేసినట్టు ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది.
చివరగా, 22వ తేదీ వరకు మిస్డ్ కాల్ రిటర్న్ చేయొద్దని మౌలానా అర్షద్ మదాని ముస్లింలకు విజ్ఞప్తి చేయలేదు.