Fake News, Telugu
 

పాకిస్థాన్ ఆర్మీ తో నృత్యం చేస్తుంది మన పైలట్ IAF పైలట్ అభినందన్ కాదు

0

పాకిస్థాన్ ఆర్మీ తో నృత్యం చేస్తోంది  మన వాయుసేన పైలట్ అభినందన్ అంటూ ఒక వీడియో ఫేస్బుక్  లో వైరల్ అవుతోంది . అది ఎంతవరకు నిజమో ఒకసారి చూద్దాం.

క్లెయిమ్ (దావా): పాకిస్థాన్ ఆర్మీ తో నృత్యం చేస్తోంది  మన వాయుసేన పైలట్ అభినందన్

ఫాక్ట్ (నిజం): వైరల్ అవుతున్న వీడియో పైలట్ అభినందన్ పాకిస్థాన్ కి పట్టుబడక ముందుది. కావున పాక్ ఆర్మీతో నృత్యం చేస్తున్నది అభినందన్ అనేది అవాస్తవం.

వైరల్ అవుతున్న వీడియోని ఇన్విడ్ ఎక్స్టెన్షన్లో సెర్చ్ చెయ్యగా వచ్చిన ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్  చేసినప్పుడు పాత యూట్యూబ్ వీడియో లభించింది.ఆ వీడియోకి సంబంధించిన టైం స్టాంప్ ని చూసినట్లయితే అది ఫిబ్రవరి 23, 2019 న అప్లోడ్ చేసినట్టుగా ఉంది.  అనగా పాక్ ఆర్మీకి అభినందన్ పట్టుబడక ముందుది ఆ వీడియో .

కావున పాక్ ఆర్మీతో నృత్యం చేస్తున్నది అభినందన్ అనేది అవాస్తవం

Share.

About Author

Comments are closed.

scroll