Fake News, Telugu
 

ఈ వీడియోలో దాడి చేస్తున్న మహిళలు, దాడికి గురైన వ్యక్తి అందరూ క్రైస్తవ మతానికి చెందిన వారే

0

Update (29 May 2023):

కేరళలో బీజేపీ మంత్రిని అక్కడి మహిళలు కొడుతున్న దృశ్యాలంటూ ఇదే వీడియోని ఇప్పుడు కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కానీ, క్రింద వివరించినట్టు, వీడియోలో మహిళలు కొండుతున్న వ్యక్తి పేరు షాజీ. ఎంపెరర్ ఇమ్మాన్యుయేల్ చర్చ్‌కు సంబంధించిన ఒక మహిళ చిత్రాలని మార్ఫ్ చేసి ఇంటర్నెట్లో షేర్ చేశాడని ఆరోపిస్తూ క్రైస్తవ మహిళల బృందం షాజీపై దాడి చేసింది. షాజీ అనే వ్యక్తి బీజేపీ మంత్రి కాదు.

Published (18 January 2023):

కేరళలో హిందూ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఒక ముస్లిం వ్యక్తిని అక్కడి హిందూ మహిళలు చితకబాదుతున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. ఈ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కేరళలో హిందూ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఒక ముస్లిం వ్యక్తిని అక్కడి హిందూ మహిళలు చితకబాదుతున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): వీడియోలోని ఘటన ఇటీవల కేరళ రాష్ట్రం త్రిస్సూర్‌ జిల్లాలోని మురియాద్ గ్రామంలో చోటుచేసుకుంది. 05 జనవరి 2023 నాడు మురియాద్ ఎంపెరర్ ఇమ్మాన్యుయేల్ చర్చ్‌కు చెందిన 50 మంది మహిళల బృందం షాజీ అనే వ్యక్తిపై, అతని కుటుంబంపై దాడి చేసిన దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. ఎంపెరర్ ఇమ్మాన్యుయేల్ చర్చ్‌కు సంబంధించిన ఒక మహిళ చిత్రాలని మార్ఫ్ చేసి ఇంటర్నెట్లో షేర్ చేశాడని ఆరోపిస్తూ క్రైస్తవ మహిళల బృందం షాజీపై దాడి చేసింది. ఈ వీడియోలో దాడి చేస్తున్న మహిళలు హిందూవులు కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లను రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని పలు వార్తా సంస్థలు ఇటీవల పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. కేరళ రాష్ట్రం మురియాద్ గ్రామంలో ఎంపెరర్ ఇమ్మాన్యుయేల్ చర్చ్ విశ్వాసులకు, చర్చి నుండి వైదొలిగిన వారి మధ్య చోటుచేసుకున్న ఘర్షణ దృశ్యాలంటూ ఈ వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలని రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ చేసిన న్యూస్ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. 05 జనవరి 2023 నాడు ఎంపెరర్ ఇమ్మాన్యుయేల్ చర్చ్‌కు సంబంధించిన మహిళల బృందం షాజీ అనే వ్యక్తిపై, అతని కుటుంబంపై దాడి చేసినట్టు ఈ ఆర్టికల్స్‌లో రిపోర్ట్ చేశారు. ఎంపెరర్ ఇమ్మాన్యుయేల్ చర్చ్‌కు సంబంధించిన ఒక మహిళ చిత్రాలని మార్ఫ్ చేసి ఇంటర్నెట్లో షేర్ చేశాడని ఆరోపిస్తూ క్రైస్తవ మహిళల బృందం షాజీపై దాడి చేసినట్టు ఈ వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. షాజీ, అతని కుటుంబం ఇటీవలే ఇమ్మాన్యుయేల్ చర్చి నుంచి విడిపోయినట్టు ఈ ఆర్టికల్స్‌లో తెలిపారు.

ఈ దాడికి సంబంధించి 59 మంది మహిళలపైన ఆలూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఎంపెరర్ ఇమ్మాన్యుయేల్ చర్చ్‌ నుండి వైదొలిగామనే కారణం చేత తమ మీద కక్ష కట్టి చర్చి విశ్వాసకులు కావాలనే దాడికి పాల్పడినట్టు ఎఫ్ఐఆర్‌లో షాజీ కుటుంబం ఆరోపించారు. పోలీసులు ఇప్పటికే ఈ దాడిలో పాలుపంచుకున్న 11 మంది మహిళలను అరెస్ట్ చేసినట్టు ‘ఇండియా టుడే’ 07 జనవరి 2023 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసింది. ఈ వీడియోలో దాడి చేస్తున్న మహిళలు, దాడికి గురైన వ్యక్తి అందరూ క్రైస్తవ మతానికి చెందిన వారు.

చివరగా, కేరళలోని ఎంపెరర్ ఇమ్మాన్యుయేల్ చర్చ్ మహిళ సభ్యులకు, చర్చి నుండి వైదొలిగిన వ్యక్తి మధ్య జరిగిన ఘర్షణ వీడియోని హిందూ-ముస్లిం మత నేపథ్యంతో షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll