Fake News, Telugu
 

చైనాలో భవన నిర్మాణ సామాగ్రి రవాణాకు డ్రోన్లని వాడుతున్న దృశ్యాలని తప్పుగా భారతదేశానికి ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు

0

ఒక కొండ ప్రాంతంలో భవన నిర్మాణ సామాగ్రిని డ్రోన్లతో తరలిస్తున్న వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది.  ఇది భారత్‌లోనే ఒక హైవే నిర్మిస్తున్న సమయంలో తీసిన వీడియో అని, ఇలా  ‘కాంక్రీటు మోయడానికి డ్రోన్లను వాడుతున్నారు’ అని చెప్తూ ఈ వీడియోని సోషల్ మీడియా యూజర్లు షేర్ చేస్తున్నారు. అసలు ఇందులో ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

క్లెయిమ్: ఈ వీడియో భారతదేశంలో హైవే నిర్మాణంలో భవన నిర్మాణ సామాగ్రి తరలించడానికి డ్రోన్లను వాడటాన్ని చూపిస్తుంది.

ఫాక్ట్(నిజం): వార్తా కథనాల ప్రకారం ఈ వీడియోని చైనాలోని యున్నన్ ప్రొవిన్స్‌లో 13 జూన్ 2024న తీసారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ వీడియో గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇందులోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, ఇది చైనాలో తీసిన వీడియో అని చెప్తూ మాకు అనేక వార్తా కథనాలు లభించాయి.

‘చైనా షిన్హువా న్యూస్’ అనే చైనా ప్రభుత్వ మీడియా వారు ఈ వీడియోని తమ ఫేస్‌బుక్ , ‘X’ మరియు యూట్యూబ్ పేజీలలో 18  జూన్ 2024న అప్లోడ్ చేశారు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ).  

ఈ వీడియో గురించి ‘న్యూస్ ఫ్లేర్’ అనే వెబ్సైటు రాస్తూ, ఈ వీడియోని చైనాలోని యున్నన్ ప్రొవిన్స్‌లో ఉన్న  ‘Nujiang Lisu Autonomous Prefecture’ లో 13 జూన్ 2024న తీసారని పేర్కొంది.

ఈ ప్రదేశంలో చరిత్రాత్మకంగా భవన నిర్మాణ సామాగ్రి సరఫరా చేయడం కష్టంగా ఉండేది అని, కానీ ఇప్పుడు ఇలా డ్రోన్ల సహాయంతో మెటీరియల్ బాగ్స్ చాలా సులభంగా రవాణా చేయగలుగుతున్నారు (ఇక్కడ, ఇక్కడ) అని అక్కడ ఒక సైట్ మేనేజర్ అభిప్రాయం వ్యక్తం చేశారు అని న్యూస్ ఫ్లేర్ వారు రాశారు

ఇదిలా ఉంచితే, భారతదేశంలో డ్రోన్లని ఉపయోగించి భవన నిర్మాణ సామాగ్రి సరఫరా చేస్తున్నట్లు అయితే ఇప్పటికే ఎటువంటి వార్తా కథనాలు లేవు. కానీ డ్రోన్లను వైద్య పరికరాలు ఇంకా వ్యాక్సిన్ సరఫరా చేయడానికి వాడచ్చు అని ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) కొన్ని సూచనలు విడుదల చేసినట్లు, మరియు కొన్ని ప్రయోగాలు చేసినట్లు మాకు కొన్ని వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ) లభించాయి. 

చివరిగా, చైనాలో భవన నిర్మాణ సామాగ్రి రవాణాకు డ్రోన్లని వాడుతున్న దృశ్యాలని తప్పుగా భారతదేశానికి ఆపాదిస్తున్నారు

Share.

About Author

Comments are closed.

scroll