Fake News, Telugu
 

ఒక స్క్రిప్టెడ్ ఫైట్ కొరియోగ్రఫీ వీడియోని తనని తప్పుగా టచ్ చేసినందుకు ఒక వెయిట్రెస్ కొందరిని కొట్టిన నిజమైన సంఘటనగా షేర్ చేస్తున్నారు.

0

ఒక బార్‌లో తనని తప్పుగా టచ్ చేసిన వ్యక్తిని ఒక వెయిట్రెస్ కొట్టిన వీడియో (ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

క్లెయిమ్: బార్‌లో తనని తప్పుగా టచ్ చేసిన వ్యక్తిని ఒక వెయిట్రెస్ కొట్టిన సంఘటన యొక్క నిజమైన సీసీటీవీ ఫుటేజ్. 

ఫ్యాక్ట్(నిజం): ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. దీన్ని క్యాంపస్ యూనివర్స్ క్యాస్కేడ్స్ అనే ఒక ఫ్రెంచ్ స్టంట్ టీమ్ వాళ్లు కొరియోగ్రాఫ్ చేశారు. కావున, వైరల్ వీడియోలో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వైరల్ వీడియో గురుంచి మరింత సమాచారం తెలుసుకోవడానికి, అందులోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, మాకు దాని గురించి ఎటువంటి సమాచారం దొరకలేదు. కానీ, వైరల్ వీడియో మీద @CAMPUS.UNIVERS.CASCADES అనే ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యొక్క ఒక వాటర్ మార్క్ ఉండటం మేము గమనించాం.

ఈ అకౌంట్ కోసం ఇంటర్నెట్లో  వేతుగా ఇది ‘Campus Univers Cascades’ అనే ఒక ఫ్రెంచ్ స్టంట్ టీమ్ యొక్క అకౌంట్ అని మాకు తెలిసింది, వీళ్ల బయోలో ఇది ప్రపంచంలోనే అతి పెద్ద స్టంట్ స్కూల్ అని పేర్కొన్నారు. వీళ్ల పేజీలో వీళ్లు స్క్రిప్టెడ్ ఫైట్ కొరియోగ్రాఫి వీడియోలని (ఇక్కడ, ఇక్కడ), టైనింగ్ మరియు ప్రాక్టీస్ వీడియోలను అప్లోడ్ చేస్తుంటారు.

ఇలా అప్లోడ్ చేసిన ఒక వీడియోను నిజమైన సంఘటన యొక్క సీసీటీవీ ఫుటేజ్ అని వైరల్ అవుతున్న వీడియో. ఈ వీడియోను ‘Campus Univers Cascades’ వాలు ఐదు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రాంలో అప్లోడ్ చేశారు. `Don’t touch the Barmaid 👊😅©️@campus.univers.cascades’ అనే క్యాప్షన్ మరియు  ‘#cucteam #video #fight #cinema #camera #action #cascadeur’ అనే హ్యాష్ట్యాగ్స్ వేసి ఈ వీడియోని వాళ్లు అప్లోడ్ చేశారు.

గతంలో కూడా వీళ్ల స్క్రిప్ట్ ఫైట్ కోరియోగ్రఫీ వీడియోని నిజమైన సంఘటన అని షేర్ చేయగా ఫ్యాక్ట్‌లీ దాన్ని ఫేక్ అని చెప్తూ ఒక ఆర్టికల్ రాసింది. ఈ ఆర్టికల్‌ని మీరు ఇక్కడ చదవవచ్చు. 

చివరిగా, ఒక స్క్రిప్టెడ్ ఫైట్ కొరియోగ్రఫీ వీడియోని తనని తప్పుగా టచ్ చేసినందుకు ఒక వెయిట్రెస్ కొందరిని కొట్టిన నిజమైన సంఘటనగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll