Fake News, Telugu
 

ఫోటోలో ఆదిత్య థాకరే తో పాటు ఉన్నది దిశా పటాని, రియా చక్రవర్తి కాదు

0

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కుమారుడైన ఆదిత్య థాకరేతో కలిసి కారులో ఉన్నది సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి అని ఆరోపిస్తూ, సుశాంత్ ఆత్మహత్య కేసులో కొనసాగుతున్న విచారణపై అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. వీరిద్దరు కారులో ఉన్న ఒక ఫోటోని కూడా పోస్ట్ ద్వారా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఆ పోస్టు లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కుమారుడైన ఆదిత్య థాకరే కలసి ఉన్న ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఫోటోలో ఆదిత్య థాకరే తో పాటు ఉన్నది దిశా పటాని, రియా చక్రవర్తి కాదు. 2019 జూన్ లో వీరిద్దరు కలిసి బయటికి వెళ్ళినప్పుడు తీసిన ఫోటో ఇది. చాలా న్యూస్ పోర్టల్స్ ఈ వార్తని ప్రచురించాయి. కావున పోస్టులో చెప్తున్నది తప్పు.

పోస్టులో ఉన్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఫోటోని ప్రచురించిన చాలా వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఈ వార్తా కథనాల ప్రకారం ఆ ఫోటోలో ఆదిత్య థాకరేతో పాటు ఉన్నది దిశా పటాని అనే బాలీవుడ్ నటి. ఈ ఫోటో 2019 జూన్ లో వీరిద్దరు కలిసి బయటికి వెళ్ళినప్పుడు తీసినది. ఈ వార్తకి సంబంధించిన వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

దిశా పటాని మరియు రియా చక్రవర్తిల ఫోటోలను కారులో ఆదిత్య థాకరేతో పాటు ఉన్న అమ్మాయి ఫోటోతో పోల్చి చూస్తే కారులో ఉన్నది దిశా పాటాని అని కచ్చితంగా చెప్పొచ్చు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకునేలా రియా చక్రవర్తి ప్రేరేపించిందని సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ పోస్ట్ షేర్ చేస్తున్నారు.

చివరగా, ఫోటోలో ఆదిత్య థాకరేతో పాటు ఉన్నది సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ గా ఆరోపించబడే రియా చక్రవర్తి కాదు.

Share.

About Author

Comments are closed.

scroll