Fake News, Telugu
 

అల్లు అర్జున్ కేసు విషయంలో చిరంజీవి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించారు అంటూ 2023 నాటి వీడియోను షేర్ చేస్తున్నారు

0

4 డిసెంబర్ 2024న సంధ్యా థియేటర్ వద్ద “పుష్ప 2” సినిమా రిలీజ్ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్‌ను నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. ఈ ఘటనపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ నేపథ్యంలో, “చిరంజీవి అల్లు అర్జున్ కేసు విషయంలో తెలంగాణ సీఎం  రేవంత్ రెడ్డిని విమర్శించారు”  అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అల్లు అర్జున్, సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు విషయంలో చిరంజీవి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో 08 ఆగస్ట్ 2023న వాల్తేరు వీరయ్య సినిమా 200-రోజుల వేడుకలో, చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మధ్య వివాదంపై మాట్లాడుతూ, ఫిల్మ్ ఇండస్ట్రీపై కాకుండా  రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని విమర్శించారు. ఈ వైరల్ వీడియోకు అల్లు అర్జున్ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ అవుతున్న వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఈ వీడియో యొక్క పూర్తి వెర్షన్ (ఆర్కైవ్డ్ లింక్) మాకు లభించింది. ఈ వీడియో 10 ఆగస్టు 2023న YouWe Media యూట్యూబ్ ఛానెల్ “వాల్తేరు వీరయ్య 200-రోజుల సెలబ్రేషన్లలో మెగాస్టార్ చిరంజీవి యొక్క పూర్తి ప్రసంగం” అనే శీర్షికతో ప్రచురించబడింది.

ఈ కార్యక్రమానికి సంబంధించిన మరింత సమాచారం కోసం తగ్గిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా, ఆగస్టు 2023లో ప్రచురించబడిన పలు వార్త కథనాలు (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) (ఆర్కైవ్డ్ లింక్ ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) మాకు లభించాయి. ఈ కథనాలు ప్రకారం, 08 ఆగస్ట్ 2023న వాల్తేరు వీరయ్య సినిమా 200-రోజుల వేడుకలో, చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మధ్య వివాదంపై మాట్లాడుతూ, ఫిల్మ్ ఇండస్ట్రీపై కాకుండా  రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని విమర్శించారు. ఈ వైరల్ వీడియోకు, ప్రస్తుతం జరుగుతున్న అల్లు అర్జున్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం అయింది.

చివరిగా, అల్లు అర్జున్ కేసు విషయంలో చిరంజీవి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించారు అంటూ 2023 నాటి వీడియోను షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll