Fake News, Telugu
 

ఛార్జింగ్ పెట్టి ఫోన్‌లో మాట్లాడుతూ నీళ్లు తాగుతుండగా ఒక వ్యక్తి మరణించాడు అని చెప్తూ ఒక స్క్రిప్టెడ్ వీడియోని షేర్ చేస్తున్నారు.

0

తన ఫోన్ ప్లగ్ చేసి మాట్లాడుతున్నప్పుడు నీళ్లు తాగిన వెంటనే ఢిల్లీలో ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మరణించాడని, ఆ ఘటనకు చెందిన CCTV ఫుటేజి అని చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

క్లెయిమ్: ప్లగ్-ఇన్ అయి ఉన్న ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు నీళ్లు తాగగా, తక్షణమే మరణించిన ఒక వ్యక్తికి చెందిన వీడియో. 

ఫాక్ట్(నిజం): ఈ వీడియో వాస్తవానికి స్క్రిప్ట్ చేయబడింది. 02 ఫిబ్రవరి 2020న భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఫేస్‌బుక్ పేజీలో ఈ వీడియో పోస్టు చేయబడింది. ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో అని, వినోదం కోసం ఈ వీడియోను తయారు చేసారని వీడియో వివరణలో ఉంది. కాబట్టి, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు

ముందుగా, వీడియో యొక్క వాస్తవికతను ధృవీకరించడానికి, మేము మొదట వీడియో యొక్క మూలాల కోసం తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్‌నెట్‌లో వెతికాము. ఇది భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా యొక్క ఫేస్‌బుక్ పేజీకి దారితీసింది. ఇదే వీడియో 02 ఫిబ్రవరి 2020 న తను పోస్ట్ చేసింది.

వీడియో పోస్ట్ యొక్క వివరణ చూసిన తర్వాత, వీడియో వినోద ప్రయోజనాల కోసం స్క్రిప్ట్ చేయబడిందని స్పష్టమైంది.

ఈ విషయాన్ని మరింత ధృవీకరించడానికి మేము వీడియోను పేజీలోని ఇతర పోస్ట్‌లతో పోల్చి చూడగా, ఈ వీడియో వంటి చాలా స్క్రిప్టెడ్ వీడియోలు తన పేజీలో దొరికాయి (ఇక్కడ,ఇక్కడ మరియు ఇక్కడ). ఈ వీడియో యొక్క శైలి, టోన్ మరియు ఫీచర్‌లు పేజీలోని ఇతర స్క్రిప్ట్ వీడియోలకి సమానంగా ఉన్నాయి. అదనంగా, ఇలాంటి సంఘటన ఏదైనా ఢిల్లీలో జరిగిందా అని తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్‌నెట్‌లో వెతకగా, దీన్ని ధృవీకరించే విధంగా ఎటువంటి వార్త కథనాలు మాకు లభించలేదు. 

ఇంకా, అసలు మొబైల్ ఫోన్ ఛార్జ్ పెట్టి ఫోన్ మాట్లాడటం వళ్ళ మనకి ఏమైనా హాని కలుగుతుందా అని ఇంటర్‌నెట్‌లో వెతుకగా, లండన్ ఇంపీరియల్ కాలెజ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హెడ్ అయిన Eric Yeatman, ఫాక్ట్ చెకింగ్ సంస్థ AFP ఫాక్ట్ చెక్ వారికి ఇచ్చిన ఒక స్టేట్మెంట్ లభించింది. ఫోన్ చార్గర్‌కి (ప్లగ్ వైపు), హానికరమైన mains voltageని హాని కలిగించని low voltage DCలోకి మార్చే యూనిట్ ఉంటుంది, ఈ low voltage DC మన ఛార్జింగ్ కేబుల్ యొక్క లీడ్ నుండి మన ఫోన్‌లోకి వెళ్తుంది.

Eric Yeatman ప్రకారం పాత, పాడైన లేదా లోపాలు ఉన్న చార్జర్లని ఉపయోగిస్తే తప్ప, మాములుగా ఫోన్ ఛార్జ్ పెట్టి ఉపయోగించడం హానికరం కాదు. కానీ ఒకవేళ పాత, పాడైన లేదా లోపాలు ఉన్న చార్జర్లని ఉపయోగిస్తే, “Mains Leakage” ఎక్కువగా ఉంటుంది, అప్పటికి అది హానికరం కాదు. కానీ ఒకవేళ ఆ చార్జర్ పూర్తిగా ఫెయిల్ అయితే electrocute (ఎలక్ట్రిక్ షాక్ ద్వారా మరణం/ గాయం) అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి చీప్ ఛార్గర్లని ఉపయోగించినప్పుడు ఒకవేళ అవి ఫెయిల్ అయితే, నిప్పు రేగే అవకాశం ఉంది అని Eric చెప్పారు.

ఇంకా,ఈ విషయం గురించి ఫాక్ట్ చెక్ ఆర్టికల్ రాస్తూ, kompass.com అనే ఇండోనేషియా న్యూస్ సంస్థ Yogyakarta State University ప్రొఫెసర్ Toto Sukisnoని, అసలు వీడియోలో చూపిస్తున్నట్టు ఎవరైనా ఛార్జింగ్ పెట్టిన మొబైల్ ఫోన్ ఉపయోగించడం వల్ల మరణించే అవకాశం ఉందా అని అడుగగా, ఒకవేళ  Leakage Current ఉంటే ఇలా జరిగే అవకాశం ఉంది అని చెప్పారు. ఈ Leakage Current మొబైల్ ఉపయోగించే వారికి హాని చేయవచ్చు కాబట్టి, Toto ఛార్జింగ్ పెట్టిన మొబైల్ ఫోన్ వాడొద్దు అని చెప్పారు.

చివరిగా, ప్లగ్-ఇన్ చేసిన ఫోన్‌లో మాట్లాడుతూ నీళ్లు తాగిన ఒక వ్యక్తి చనిపోయిన సంఘటనకి చెందినది అని చెప్తున్న ఈ వీడియో నిజానికి వినోద ప్రయోజనాల కోసం స్క్రిప్ట్ చేసి తీయబడిన డ్రామా లేదా స్కిట్. 

Share.

About Author

Comments are closed.

scroll