Fake News, Telugu
 

ఒక స్క్రిప్టెడ్ వీడియోని నిజమైన లవ్ జిహాద్ ఘటన వీడియోగా షేర్ చేస్తున్నారు

0

సల్మాన్ అనేవాడు రాహుల్‌గా అని పేరు మార్చుకుని హిందూ అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకోవాలని చూసాడు……హిందూ అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త”, అని చెప్తూ ఒక వీడియోని ‘Love_Jihad’ అనే హాష్‌టాగ్‌తో సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: సల్మాన్ అనేవాడు రాహుల్‌గా పేరు మార్చుకుని హిందూ అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకోవాలని చూసిన లవ్ జిహాద్ ఘటన వీడియో.

ఫాక్ట్: పోస్ట్‌లోని వీడియోలో జరిగినది నిజమైన ఘటన కాదు. అది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ‘Basant Jangra’ అనే ఒక ఆర్టిస్ట్ పేజీ ఆ వీడియోని మొదటిగా ఫేస్బుక్‌లో పోస్ట్ చేసింది. అలాంటి చాలా స్క్రిప్టెడ్ వీడియోలు ఆ పేజీలో చూడవచ్చు. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.

పోస్ట్‌లోని వీడియో గురించి వెతకగా, ‘Basant Jangra’ అనే ఒక ఆర్టిస్ట్ పేజీ ఆ వీడియోని మొదటిగా ఫేస్బుక్‌లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఆ పేజీలో పెట్టేవి స్క్రిప్టెడ్ వీడియోలని, వాస్తవ ఘటనలు కావని ఆ పేజీ పోస్ట్ చేసిన వివిధ ఇతర వీడియోల్లో గమనిక రాసినట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

పోస్ట్‌లోని వీడియోలో కూడా బసంత్ జాంగ్ర ఆర్టిస్ట్‌ని చూడవచ్చు. అంతేకాదు, వీడియోలోని పెళ్లి కూతురు దుస్తులు మరియు ఆ పేజీ పోస్ట్ చేసిన ఇతర పెళ్లికి సంబంధించిన వీడియోలలోని పెళ్లి కూతురు దుస్తులు ఒకే విధంగా ఉండడం గమనించవచ్చు. ఆ వీడియోలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. వీడియో గురించి బసంత్ జాంగ్రకి కూడా FACTLY మెసేజ్ చేసింది; అతని నుండి జవాబు వస్తే ఈ అర్టికల్‌లో అప్డేట్ ఇస్తాము.

ఇంతకముందు కూడా ఇలాంటి చాలా స్క్రిప్టెడ్ వీడియోలు వాస్తవ ఘటనలుగా వైరల్ అయినప్పుడు, వాటి గురించి FACTLY రాసిన ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చదవచ్చు.

చివరగా, స్క్రిప్టెడ్ వీడియోని నిజమైన లవ్ జిహాద్ ఘటన వీడియోగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll