Fake News, Telugu
 

ఒక స్క్రిప్టెడ్ ఫైట్ కొరియోగ్రఫీ వీడియోని ఒక యువతిపై కొందరు యువకులు దాడి చేసినప్పుడు ఆమె వారిని కొట్టిన నిజమైన సంఘటనగా షేర్ చేస్తున్నారు

0

ఒక యువతి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో, కొందరు యువకులు ఆమెపై దాడి చేసి, బ్యాగ్ లాగేందుకు ప్రయత్నించగా వెంటనే ఆ యువతి స్పందిస్తూ వారిని తిరిగి కొట్టినట్లు చూపిస్తున్న సీసీటీవీ  దృశ్యాలు సోషల్ మీడియాలో (ఇక్కడ,ఇక్కడ మరియు ఇక్కడ) వైరల్ అవుతున్నాయి. దీని వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఒక యువతిపై కొందరు యువకులు దాడి చేసినప్పుడు ఆమె వారిని తిరిగి కొట్టినట్లు చూపిస్తున్న సీసీటీవీ దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో, నిజమైన సంఘటన కాదు. దీన్ని క్యాంపస్ యూనివర్స్ క్యాస్కేడ్స్ అనే ఒక ఫ్రెంచ్ స్టంట్ టీమ్ వాళ్లు కొరియోగ్రాఫ్ చేసి అప్లోడ్ చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ అవుతున్న వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు అదే వీడియో (ఆర్కైవ్డ్ లింక్) మాకు @CAMPUS.UNIVERS.CASCADES అనే ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో “Brave or reckless woman 🫢🏆©️ @campus.univers.cascades “ అనే క్యాప్షన్ మరియు #videos #cucteam #fight #martialarts #cinema #boxing #ko అనే హ్యాష్ ట్యాగ్‌తో అప్‌లోడ్ చేసిన వీడియో మాకు దొరికింది.

ఈ అకౌంట్ బయోని పరిశీలించగా ఇది ఒక ఫ్రెంచ్ స్టంట్ టీమ్ యొక్క అకౌంట్ అని మాకు తెలిసింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద స్టంట్ స్కూల్, వీళ్ల పేజీలో వీళ్లు స్క్రిప్టెడ్ ఫైట్ కొరియోగ్రఫీ వీడియోలని (ఇక్కడ, ఇక్కడ), ట్రైనింగ్ మరియు ప్రాక్టీస్ వీడియోలను అప్లోడ్ చేస్తుంటారు.

గతంలో కూడా ఈ అకౌంట్ లో షేర్ చేసిన పలు స్క్రిప్ట్ ఫైట్ కొరియోగ్రఫీ వీడియోలను నిజమైన సంఘటనలు అని షేర్ చేయగా వాటిని ఫాక్ట్ చెక్ చేస్తూ ఫ్యాక్ట్‌లీ రాసిన కథనాలను ఇక్కడ మరియు ఇక్కడ చదవవచ్చు.

చివరిగా, ఒక స్క్రిప్టెడ్ ఫైట్ కొరియోగ్రఫీ వీడియోని ఒక యువతిపై కొందరు యువకులు దాడి చేసినప్పుడు ఆమె వారిని కొట్టిన నిజమైన సంఘటనగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll