తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరాడంటూ ఒక పోస్టు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న వాస్తవమేంటో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరాడు.
ఫాక్ట్(నిజం): ఈ ఫొటో తెలంగాణ కాంగ్రెస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి, TNGO సంఘం మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లో చేరిన రోజుకు సంబంధించింది. అసలు ఫొటోలో మామిళ్ళ రాజేందర్ ముఖం స్థానంలో తీన్మార్ మల్లన్న ముఖం పెట్టి ఎడిట్ చేసి షేర్ చేసారు. కావున, ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
ఈ క్లెయిమ్ గురించి కీ వర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్లో వెతికితే, ఇటువంటి వార్త ఏ న్యూస్ ఛానల్ లేదా వార్తా పత్రిక ప్రచురించినట్టు కనిపించలేదు. ఈ పోస్టులో ఉన్న ఫొటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే, ఇటువంటి ఫొటో పలు వార్తా పత్రికలు ప్రచురించినట్టు గమనించాం (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). ఈ ఫొటో తెలంగాణ కాంగ్రెస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి, TNGO సంఘం మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లో చేరిన రోజుకు సంబంధించింది.
అసలు ఫొటోలో TNGO సంఘం ప్రెసిడెంట్ మామిళ్ళ రాజేందర్ ముఖం స్థానంలో తీన్మార్ మల్లన్న ముఖం పెట్టి ఎడిట్ చేసి షేర్ చేసారు. అసలు, వైరల్ ఫొటోల మధ్య పోలిక క్రింద చూడవచ్చు.
చివరిగా, మార్ఫ్ చేసిన ఫొటోను షేర్ చేస్తూ తీన్మార్ మల్లన్న బిఆర్ఎస్ పార్టీలో చేరాడని పేర్కొంటున్నారు.