Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

భారత్ లో లాక్ డౌన్ గురించి సీబీఐ మాజీ జేడీ వి.వి. లక్ష్మీనారాయణ పేరిట చలామణీ అవుతున్న ఆడియో క్లిప్ నకిలీది

0

సీబీఐ మాజీ జేడీ వి.వి. లక్ష్మీనారాయణ యొక్క వాయిస్ మెసేజ్ అంటూ ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియా లో చలామణీ అవుతోంది. ఆ ఆడియో క్లిప్ లో మాట్లాడే వ్యాక్తి ఇండియా వచ్చే రెండు నెలలు పూర్తి లాక్ డౌన్ లో ఉండబోతుందని, అందువల్ల ఇంట్లోకి  సరిపడా ఆహారం, మందులు మరియు నగదు సిద్ధపరుచుకోవాలని చెప్తాడు. లాక్ డౌన్ రెండు నెలలు ఉండాల్సిందిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మన గవర్నమెంట్ కి చెప్పిందని, ఆ విషయన్ని తనకు WHO డైరెక్టర్ కి పని చేసే తన బంధువు ఒకరు తెలిపాడని ఆ ఆడియో క్లిప్ లోని వ్యక్తి అంటాడు. లక్ష్మీనారాయణ తన పేరిట చలామణీ అవుతున్న ఆడియో క్లిప్ గురించి గతంలోనే ఖండించి స్పష్టత ఇచ్చారని FACTLY విశ్లేషణలో తెలిసింది. ఒక యూట్యూబ్ వీడియో ద్వారా, ఆ ఆడియో క్లిప్ లో మాట్లాడింది తాను కాదని, కొంతమంది వ్యక్తులు జనాలను భయబ్రాంతులకు గురిచేయడానికి ఆ విధంగా ప్రయత్నిస్తున్నారని లక్ష్మీనారాయణ చెప్పారు. ఆ వీడియో చివరన జనాలకు ఏ విషయం చెప్పాలనుకున్నా వీడియో రూపంలో మాత్రమే లక్ష్మీనారాయణ చెప్తారనే ఒక విజ్ఞప్తి ఉంది.

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. యూట్యూబ్ వీడియో – https://www.youtube.com/watch?v=y_tjos1eLMU

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll