Fake News, Telugu
 

కేటీఆర్ కొడంగల్ సభలో కొందరు కాంగ్రెస్ నినాదాలు చేసారని చెప్తూ ఒక ఎడిట్ చేసిన వీడియోని షేర్ చేస్తున్నారు

0

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) కొడంగల్‌లో ప్రసంగిస్తున్న సమయంలో కొందరు కాంగ్రెస్‌కు మద్దతుగా నినాదాలు చేయసారని ఒక వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. తను ప్రసంగిస్తుండగా కొందరు జై కాంగ్రెస్, రేవంత్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి అని అనడం వీడియోలో చూడవచ్చు.   కొడంగల్ కేటీఆర్ సభలో కాంగ్రెస్ జోరు అని చెప్తున్న ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

క్లెయిమ్: కొడంగల్‌లో జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగిస్తుండగా కొందరు కాంగ్రెస్ నినాదాలు చేశారు. 

ఫాక్ట్(నిజం): ఇది ఒక ఎడిట్ చేసిన వీడియో. నిజానికి 09 నవంబర్ 2023న కొడంగల్‌లో జరిగిన ఒక సభలో కేటీఆర్ ప్రసంగం చేస్తున్నప్పుడు వైరల్ వీడియోలో చూపిస్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నినాదాలు ఎవరూ చెయ్యలేదు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాల్ని తెలుసుకోవటానికి తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేసాము.    

ఈ సెర్చ్ ద్వారా వైరల్ వీడియో 9వ నవంబరు 2023 నాడు కొడంగల్‌లో జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ ఇచ్చిన ప్రసంగంలోని ఒక చిన్న భాగం అని అర్థం అయ్యింది. ఈ పూర్తి ప్రసంగం ఉన్న వీడియోలు మీరు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.  తాను వైరల్ వీడియోలో మాట్లాడుతున్న భాగాన్ని ఇక్కడ చూడవచ్చు. 

“ముచ్చటగా మూడోసారి..ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అవుతారు” అంటూ కేటీఆర్ తన ప్రసంగంలో అన్న తర్వాత, వైరల్ అవుతున్న వీడియోకు విరుద్ధంగా ఒరిజినల్ ఫుటేజీలో కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి  మద్దతుగా జై కాంగ్రెస్, రేవంత్ అన్న నాయకత్వం.. వర్ధిల్లాలి అన్న నినాదాలు ఎవరూ చేయలేదు. కాంగ్రెస్, రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉండే నినాదాలు ఈ చిన్న భాగానికి జోడించి వైరల్ వీడియోని ఎడిట్ చేసినట్లు ఈ వైరుధ్యం స్పష్టంగా తెలియజేస్తుంది. 

చివరిగా, ఒక చేసిన వీడియోని షేర్ చేస్తూ కొడంగల్ కేటీఆర్ సభలో కొందరు కాంగ్రెస్ నినాదాలు చేసారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll