Fake News, Telugu
 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఉయ్యూరులో తవ్వకాల్లో బుద్ధ విగ్రహం బయటపడ్డ సంఘటన 2019లో జరిగింది, ఇప్పుడు కాదు.

0

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలో ఉన్న ఉయ్యురు మండలంలో ఒక రామాలయం నిర్మిస్తూ ఉండగా, తవ్వకాల్లో ఒక బుద్ధుని విగ్రహం దొరికింది అని క్లెయిమ్ చేస్తున్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టులో ఉన్న ఫొటోలో కొందరు వ్యక్తులు ఒక బుద్ధ విగ్రహంతో నిలుచొని ఉండటం మనం చూడవచ్చు. పోస్టు వివరణను బట్టి ఈ సంఘటన గురించిన వార్త మొన్న (అనగా 02 మే 2023వ తారీఖున) టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమయింది. అసలు ఈ క్లెయిములో ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: కృష్ణా జిల్లాలోని ఉయ్యురు మండలంలో ఉన్న మేడూరు గ్రామంలో, తవ్వకాల్లో ఒక నల్లరాయి బుద్ధ విగ్రహం బయటపడింది .

 ఫాక్ట్(నిజం):  పోస్టులో చెప్తున్నట్లు ఈ సంఘటనపై టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక వార్త కథనం ప్రచురితమయింది. కానీ, ఈ సంఘటన 2019లో జరిగింది, ఇప్పుడు కాదు. కావున పోస్టులో చెప్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. 

పోస్టులో చేస్తున్న క్లెయిములో ఎంత వాస్తవం ఉందో తెలుసుకోవటానికి, అందులో ఉన్న ఫోటోను ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూసాము. పోస్టులో వివరించిన సంఘటన నిజంగానే జరిగింది అని, దీనిపై 2019లో వచ్చిన టైమ్స్ ఆఫ్ ఇండియా వారి ఒక వార్త కథనం ద్వారా తెలిసింది. ఈ కథనంలో పోస్టులో ఉన్న అదే ఫోటో ఉంది.

ఆగస్టు 2019లో  కృషా జిల్లాలోని ఉయ్యురులో ఓ రామాలయం నిర్మిస్తున్న సమయంలో, తవ్వకాల సమయంలో భూమిలో ఒక బుద్ధుని విగ్రహం లభించింది. ఇందులో బుద్ధుడు ధ్యాన ముద్రలో ఉన్నాడని, ఇది 12 లేదా 13వ శతాబ్దం నాటిది అని పురావస్తు శాస్రవేత్తలు అనుకంటున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వారు రాసారు. ఇదే సంఘటనపై 2019లో హన్స్ ఇండియా కూడా ఒక కథనాన్ని ప్రచురించింది. దీన్ని బట్టి సుమారు మూడున్నర సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటనను ఈ పోస్ట్ ఈ మధ్య జరిగిన విషయంగా తప్పుగా షేర్ చేస్తున్నారు. 

ఉయ్యూరు తవ్వకాల్లో బుద్ధ విగ్రహం బయటపడ్డ సంఘటన 2019లో జరిగింది, ఇప్పుడు కాదు.

Share.

About Author

Comments are closed.

scroll