Fake News, Telugu
 

ఇరుక్కుపోయిన జెండాని ఒక పక్షి వచ్చి విప్పదీసింది? కాదు, ఇదంతా కెమెరా యాంగిల్ మహిమ.

0

“కేరళ – జాతీయ జెండా ఎగుర వేస్తుండగా పైభాగంలో ఇరుక్కుపోయింది.   ఎక్కడి నుండో ఒక పక్షి వచ్చి విప్పేసింది!!.. ” అని చెప్తూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక స్కూలు వాతావరణం కనిస్తుంది, కొందరు జాతీయ జెండా ఎగురవేయడం మనం ఇందులో చూడవచ్చు. అయితే జెండా పై దాకా వెళ్లి అక్కడ ఇరుక్కుపోతుంది, అదే సమయంలో ఒక పక్షి దాని వెనుకగా ఎగురుకుంటూ వచ్చి, జెండా వెనుక భాగంలో ఆగి, ఇరుక్కుపోయిన జెండా మళ్ళీ మామూలుగా రెపరెపలాడాక వెళ్ళిపోతుంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: జెండా వందనం సమయంలో, భారత జాతీయ జెండా స్తంభం అంచున ఇరుక్కుపోగా ఒక పక్షి వచ్చి దాన్ని విడిపించిన వీడియో.

ఫ్యాక్ట్(నిజం): ఇది కేవలం కెమెరా యాంగిల్ మహిమ మాత్రమే. ఇదే జెండా వందనాన్ని వేరే యాంగిల్ నుంచి తీసిన వీడియో చూస్తే, ఆ పక్షి వెనుక ఉన్న కొబ్బరి చెట్టు ఆకుపై వాలి వెళ్లిపోవడాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు. కాబట్టి, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వైరల్ వీడియో గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి, తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, ఈ వీడియో ఉన్న ఒక ‘X’ పోస్ట్ కింద ఈ సంఘటనని వేరే యాంగిల్ నుంచి షూట్ చేసిన వీడియో ఒకటి మాకు దొరికింది. 

సుధీర్ కొఠారి అనే ఒక వ్యక్తి దీన్ని పోస్ట్ చేశారు. ఈ యాంగిల్ నుంచి చూస్తే మనకి అసలు విషయం అర్థం అవుతుంది. జెండా ఉన్న స్తంభం వెనుక కొన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి, ఎగిరి వచ్చిన పక్షి నిజానికి  ఈ చెట్లలో ఒక దానిపై వాలి వెళ్ళిపోతుంది. దీన్నే మనం వైరల్ వీడియోని తీసిన యాంగిల్ నుంచి చూస్తే, ఆ పక్షి నిజంగానే ఇరుక్కుపోయిన జెండాని విడిపించి, ఎగరడానికి సహాయ పడినట్లు ఉంటుంది. ఈ వ్యత్యాసాన్ని మీరు కింద స్పష్టంగా చూడొచ్చు. 

ఇదే విషయాన్ని ‘హిందుస్థాన్ టైమ్స్’ , ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’, ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వంటి ప్రముఖ వార్తా సంస్థలు కూడా రిపోర్ట్ చేసాయి. 

చివరిగా, వైరల్ వీడియోలో చెబుతున్నట్లు ఒక ఇరుక్కుపోయిన జెండాని ఒక పక్షి ఎగిరి వచ్చి విప్పలేదు, ఇదంతా కేవలం వీడియో తీసిన కెమెరా యాంగిల్ వల్ల కలిగిన ఒక ఆప్టికల్ ఇల్యూషన్ మాత్రమే.

Share.

About Author

Comments are closed.

scroll