Fake News, Telugu
 

రాజ్‌నాథ్ సింగ్ ఫ్రాన్స్ లో పాల్గొన్న కార్యక్రమంలోని ఫోటోను ఎడిట్ చేసి సరిహద్దు దగ్గర రక్షణ కోసం నిమ్మకాయలు కడుతున్నట్టు షేర్ చేస్తున్నారు

0

భారత సరిహద్దుల్లో రక్షణ కోసం నిమ్మకాయలు కడుతున్న రక్షణ మంత్రి ఫోటో అని క్లెయిమ్ చేస్తూ రాజ్‌నాథ్ సింగ్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం. 

క్లెయిమ్: సరిహద్దుల్లో రక్షణ కోసం నిమ్మకాయలు కడుతున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోటో. 

ఫాక్ట్ (నిజం): ఇది ఎడిట్ చేసిన ఫోటో. 2019లో సౌత్ వెస్ట్రన్ ఫ్రాన్స్ లోని బోర్డియక్స్ దగ్గర ఉన్న డసౌల్ట్ ఏవియేషన్ ప్లాంట్ దగ్గర జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నప్పుడు తీసిన ఫోటోను ఎడిట్ చేసి సరిహద్దుల్లో రక్షణ కోసం నిమ్మకాయలను కడుతున్నట్టుగా చూపించారు. కావున, ఈ పోస్ట్ లో చేసిన క్లెయిమ్ తప్పు

పోస్టులో వైరల్ అవుతున్న క్లెయిమ్ నిజామా కాదా అని తెలుసుకోడానికి, ఫోటోని గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా 2020లో ప్రచురించిన ఒక వార్తా కథనం కనిపించింది. అందులో ఉన్న ఫోటోలో రాజ్‌నాథ్ సింగ్ ఒక రాఫెల్ జెట్ మీద ఏదో రాస్తున్నటుగా ఉంది. ఈ కథనం ప్రకారం ఫ్రాన్స్ దేశం రాఫెల్ ఫైటర్ జెట్ లను భారత్ కి అందచేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నప్పటి ఫోటో ఇది అని ఉంది. ఇదే ఫోటో స్టాక్ ఇమేజెస్ వెబ్సైట్ ఆలామిలో కూడా లభించింది. ఈ ఫోటోకి, క్లెయిమ్ లో షేర్ చేసిన ఫోటోకి మధ్య తేడాను కింద గమనించవచ్చు.  

గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా లభించిన ఆ రెండు ఫోటోల కింద వివరణలో సోర్స్ అసోసియేటెడ్ ప్రెస్ (AP) అని ఉండడంతో వారి వెబ్సైట్ లో ‘rajnath singh rafale jets’ అనే కీ వర్డ్స్ తో వెతకగా ఈ కార్యక్రమంకి సంబందించిన ఫోటోలు లభించాయి. అందులో క్లెయిమ్ లో షేర్ చేసిన ఫోటోకి సంబందించిన అసలు ఫోటో కూడా కనిపించింది. దాని ప్రకారం, ఈ కార్యక్రమం 8 అక్టోబర్ 2019న సౌత్ వెస్ట్రన్ ఫ్రాన్స్ లోని బోర్డియక్స్ నగరం దగ్గర ఉన్న డసౌల్ట్ ఏవియేషన్ ప్లాంట్ దగ్గర జరిగిందని, ఆ కార్యక్రమంలో భాగంగానే రాజ్‌నాథ్ సింగ్ రాఫెల్ జెట్ మీద రాస్తున్నట్టు పేర్కొన్నారు. 

అంతేకాకుండా, రాజనాథ్ సింగ్ తన అధికారిక X అకౌంట్ లో కూడా ఆ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను అదే రోజు షేర్ చేసారు. ఈ ఫోటోలలో ఆయన వస్త్రధారణ, క్లెయిమ్ లో వున్న ఫోటోలో ఆయన వస్త్రధారణ ఒకేలా ఉండడం గమనించవచ్చు. దీనిని బట్టి క్లెయిమ్ లో షేర్ చేసినది ఎడిట్ చేసిన ఫోటో అని నిర్ధారించవొచ్చు.

చివరగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫ్రాన్స్ లో పాల్గొన్న కార్యక్రమంలోని ఫోటోను ఎడిట్ చేసి సరిహద్దు దగ్గర రక్షణ కోసం నిమ్మకాయలు కడుతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll