Fake News, Telugu
 

ఈ వీడియో తాజాగా ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలకి సంబంధించింది కాదు

0

‘తీవ్ర నిర్బంధాన్ని ఎదురొడ్డి ఢిల్లీ వీధుల్లో కదం తొక్కుతున్న రైతన్నలు’ అని చెప్తూ, ఒక ర్యాలీ వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తాజాగా ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలకి సంబంధించిన ర్యాలీ వీడియో.

ఫాక్ట్: పోస్ట్ లోని వీడియోకీ, తాజాగా ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలకి ఎటువంటి సంబంధంలేదు. ఆ వీడియో కనీసం 2018 నుండి ఇంటర్నెట్ లో షేర్ అవుతుంది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే వీడియో సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. యూట్యూబ్ లో ఒకరు అదే వీడియోని ఏప్రిల్ 2018 లో పోస్ట్ చేసినట్టు చూడవొచ్చు. ఆ వీడియో ఎక్కడిదో కచ్చితమైన సమాచారం లేనప్పటికీ, ఆ వీడియో తాజా రైతుల నిరసనలకి సంబంధించిన వీడియో కాదని చెప్పవొచ్చు.

తాజాగా రైతులు చేస్తున్న నిరసనలకి సంబంధించిన కొన్ని దృశ్యాలను ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, పోస్ట్ చేసిన వీడియో తాజాగా ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలకి సంబంధించింది కాదు.

Share.

About Author

Comments are closed.

scroll