Fake News, Telugu
 

2018లో ఉగ్రవాదులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఒక కాంగ్రెస్ నాయకుని వీడియోను ఇటీవల జరిగిందిగా షేర్ చేస్తున్నారు

0

“కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎన్కౌంటర్ లో చనిపోయిన ఉగ్రవాదులకు కోటి రూపాయలు ఇస్తాము. జైల్లో ఉన్న ఉగ్రవాదులను విడుదల చేస్తాము.” అని అంటూ ఒక వీడియోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: “కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎన్కౌంటర్ లో చనిపోయిన ఉగ్రవాదులకు కోటి రూపాయలు ఇస్తాము. జైల్లో ఉన్న ఉగ్రవాదులను విడుదల చేస్తాము.” అని అంటున్న కాంగ్రెస్ పార్టీ వీడియో.

ఫాక్ట్: “కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ఎవరైతే ఉగ్రవాదం పేరిట జైలులో ఉన్నారో వారిని బయటకు తీసుకొస్తాం. చనిపోయిన వారికి కోటి రూపాయలు ఇస్తాం” అని కాంగ్రెస్ లీడర్ సఘీర్ సయీద్ ఖాన్ 2018లో అన్నాడు. 2018లో జమ్మూలో స్థానిక పాత్రికేయులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ లీడర్ సఘీర్ సయీద్ ఖాన్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని లక్ష్యంగా చేసుకుని, జమ్మూ కాశ్మీర్ లో కాషాయ పార్టీ “అమాయక ప్రజలపై దురాగతాలకు” పాల్పడుతోందని అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఖాన్ చేసిన వ్యాఖ్యలను అప్పట్లోనే తిరస్కరించింది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.       

వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే వీడియో యూట్యూబ్‌లో లభించింది. 26 డిసెంబర్ 2018న ఈ వీడియోను “JK MEDIA OFFICIAL” వారు అప్లోడ్ చేసారు. కాంగ్రెస్ లీడర్ సఘీర్ సయీద్ ఖాన్ ఉగ్రవాదులకు సంబంధించి అప్పట్లో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ఎవరైతే ఉగ్రవాదం పేరిట జైలులో ఉన్నారో వారిని బయటకు తీసుకొస్తాం. చనిపోయిన వారికి కోటి రూపాయలు ఇస్తాం. బులంద్ షహర్లో బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, భాజపా ఉగ్రవాదులకు పరిహారం లభించినప్పుడు, కాశ్మీర్ లో చనిపోయిన అమాయకులకు ఎందుకు పరిహారం ఇవ్వకూడదు.”

2018లో జమ్మూలో స్థానిక పాత్రికేయులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకుడు సఘీర్ సయీద్ ఖాన్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని లక్ష్యంగా చేసుకుని, జమ్మూ కాశ్మీర్ లో కాషాయ పార్టీ “అమాయక ప్రజలపై దురాగతాలకు” పాల్పడుతోందని అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అప్పటలోనే ఖాన్ చేసిన వ్యాఖ్యలను తిరస్కరించింది.

కాంగ్రెస్ సఘీర్ సయీద్ ఖాన్ ప్రకటనను తిరస్కరిస్తుంది. అతను పార్టీ ప్రతినిధి కాదు. అటువంటి సమస్యలపై మాట్లాడటానికి అతనికి అధికారం లేదు. అతనిపై చర్యలు తీసుకోవడానికి మేము మా జాతీయ నాయకత్వానికి సిఫార్సు చేస్తాము. ఉగ్రవాదంపై పోరాటంలో మేము మా భద్రతా దళాలతో నిలబడతాము” అని జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రవిందర్ శర్మ 2018లోనే అన్నారు.

చివరగా, “కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎన్కౌంటర్ లో చనిపోయిన ఉగ్రవాదులకు కోటి రూపాయలు ఇస్తాము” అని 2018లో ఒక కాంగ్రెస్ లీడర్ చేసిన వ్యాఖ్యలను అప్పట్లోనే కాంగ్రెస్ తిరస్కరించింది.

Share.

About Author

Comments are closed.

scroll