Fake News, Telugu
 

2018 ధోల్ ప్రదర్శన వీడియోను, ఎయిర్ ఇండియా కొన్న తరువాత తొలి టాటా విమానంలో జరిగిన వేడుక అని అంటున్నారు

0

టాటా వారు ఎయిర్ ఇండియా కొన్న తరువాత తొలి విమానంలో జరిగిన ఈ వేడుకలు అంటూ ఒక వీడియోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: టాటా వారు ఎయిర్ ఇండియా కొన్న తరువాత తొలి విమానంలో జరిగిన వేడుక వీడియో.

ఫాక్ట్: ఈ వీడియో 2018లో తీసింది, 2021లో కాదు. 2018లో ఎయిర్ ఇండియా అమ్రిత్‌సర్ నుండి బర్మింగ్‌హామ్ మధ్య నాన్ స్టాప్ విమానాలను ఎనిమిదేళ్ల తరువాత తిరిగి ప్రారంభించిన వేళ ప్రత్యేక ధోల్ ప్రదర్శన జరిగినప్పుడు తీసిన వీడియో ఇది. 68 సంవత్సరాల తరువాత టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను తిరిగి కొనుగోలు చేసింది. టాటా గ్రూప్ వారు ప్రభుత్వంతో చేసిన షేర్ పర్చేస్ అగ్రిమెంట్ ప్రకారం, 23 జనవరి 2022 లోగా ఎయిర్ ఇండియాను కంట్రోల్లో తీసుకొని ప్రారంభించాలని ఉంది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే విజువల్స్‌తో ఉన్న వీడియో ఒకటి ధోల్ బ్లాస్టర్స్ వెబ్సైటులో లభించింది. అదే ధోల్ బ్లాస్టర్స్ వారి వీడియోను యూట్యూబ్‌లో 09 మార్చ్ 2018న అప్లోడ్ చేసినట్టు తెలుస్తుంది. టాటా వారు ఎయిర్ ఇండియాను అప్పటికి ఇంకా కొనుగోలు చేయలేదు. “ఎయిర్ ఇండియా విమానం లోపల ఆడుతున్న ధోల్ బ్లాస్టర్లు” అనే టైటిల్‌తో వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసారు.

కీ వర్డ్స్ ఉపయోగించి గూగుల్లో వెతకగా, ఈ వీడియోకు సంబంధించిన ఒక ఆర్టికల్ లభించింది. 2018లో, ఎనిమిదేళ్ల విరామం తరువాత, ఎయిర్ ఇండియా అమ్రిత్‌సర్ నుండి బర్మింగ్‌హామ్ మధ్య నాన్ స్టాప్ విమానాలను తిరిగి ప్రారంభించింది. బ్రిటన్ నుండి భారతదేశానికి ప్రయాణించే ప్రయాణీకుల మధ్య ఈ ప్రత్యేక ధోల్ ప్రదర్శన జరిగినట్టు ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. ఆ మొదటి ఫ్లైట్ టేకాఫ్ కు కొన్ని క్షణాల ముందు ఈ వీడియో తీసినట్టు తెలుస్తుంది.

68 సంవత్సరాల తరువాత టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను రి-అక్వైర్ చేసుకుంది. టాటా గ్రూప్ వారు ప్రభుత్వంతో చేసిన షేర్ పర్చేస్ అగ్రిమెంట్ ప్రకారం, 23 జనవరి 2022 లోగా ఎయిర్ ఇండియాను కంట్రోల్లో తీసుకొని ప్రారంభించాలని ఉంది. కావున, అప్పుడే వేడుకలు మొదలయ్యాయి అనటంలో అర్థంలేదు.

చివరగా, 2018లో ఎయిర్ ఇండియా విమానంలో జరిగిన ప్రత్యేక ధోల్ ప్రదర్శన వీడియోను, టాటా వారు ఎయిర్ ఇండియా కొన్న తరువాత తొలి విమానంలో జరిగిన వేడుక అని అంటున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll