Fake News, Telugu
 

2017లో జరిగిన రాజస్థాన్‌ విద్యార్థి సంఘ ఎన్నికల్లో SFI ప్రదర్శనని ఇటీవల జరిగిందిగా షేర్ చేస్తున్నారు

0

రాజస్థాన్‌లో 25 కాలేజీల్లో జరిగిన విద్యార్థి సంఘ ఎన్నికల్లో 21 కాలేజీల్లో విజయం సాధించిన SFI అని అంటూ ఒక పోస్ట్ ద్వారా బాగా షేర్ చేస్తున్నారు. బీజేపీ అడ్డాలో మట్టి కరిచిన ఏబీవీపీ అని కూడా పోస్ట్ ద్వారా అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: రాజస్థాన్‌లో 25 కాలేజీల్లో జరిగిన విద్యార్థి సంఘ ఎన్నికల్లో 21 కాలేజీల్లో విజయం సాధించిన ఎస్ఎఫ్ఐ.

ఫాక్ట్: 2020లో కోవిడ్ కారణంగా అసలు రాజస్థాన్‌లో విద్యార్థి సంఘ ఎన్నికలు జరగనేలేదు. 2021లో రాజస్థాన్‌లో విద్యార్థి సంఘ ఎన్నికలు జరపాలా లేదా అని ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ సంవత్సరం (2021)లో విద్యార్థి సంఘ ఎన్నికలు జరపాలని రాజస్థాన్ యూనివర్సిటీ విద్యార్ధులు నిరసనలు కూడా చేసారు. 2017లో రాజస్థాన్‌లో జరిగిన విద్యార్థి సంఘ ఎన్నికల్లో SFI, 21 కాలేజీలలో గెలిచిందని న్యూస్ క్లిక్, ఐదిట్లో గెలిచిందని ఇండియా టుడే వారు రెండు భిన్నమైన న్యూస్ రిపోర్ట్స్ పబ్లిష్ చేసారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.       

పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, అలా జరిగినట్టు ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే అలాంటిది జరిగుంటే, వార్తాపత్రికలు దాని గురించి ప్రచురించేవి. న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం, 2020లో కోవిడ్ కారణంగా అసలు రాజస్థాన్‌లో విద్యార్థి సంఘ ఎన్నికలు జరగనేలేదు. ఈ సంవత్సరం (2021)లో విద్యార్థి సంఘ ఎన్నికలు జరపాలని రాజస్థాన్ యూనివర్సిటీ విద్యార్ధులు నిరసనలు చేసినట్టు టైమ్స్ అఫ్ ఇండియా 09 అక్టోబర్ 2021న ప్రచురించిన ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది.

2017లో రాజస్థాన్‌లో జరిగిన విద్యార్థి సంఘ ఎన్నికల్లో SFI, 21 కాలేజీలలో గెలిచిందని న్యూస్ క్లిక్, ఐదిట్లో గెలిచిందని ఇండియా టుడే వారు రిపోర్ట్ చేసారు.

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఇంతవరకు ఆధిపత్యం కనబరిచిన రాజస్థాన్ లోని 17 కాలేజీల్లో SFI ప్రెసిడెంట్ పోస్ట్ గెలుచుకుందని న్యూస్ క్లిక్ ఆర్టికల్‌లో అంటున్నారు. ఈ 17తో పాటు, SFI మరో నాలుగు కాలేజీల్లో ప్రెసిడెంట్ పోస్ట్ పోటీలేకుండా గెలుచుకుందని న్యూస్ క్లిక్ వారు అంటున్నారు.

2017 రాజస్థాన్‌ విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఏబీవీపీ 62, ఎన్.ఎస్.యు.ఐ 23, ఇండిపెండెంట్లు 30, SFI 5, మరికొందరు (others) 11 ప్రెసిడెంట్ పోస్టులు దక్కించుకున్నారని ఇండియా టుడే వారు అంటున్నారు.

చివరగా, 2017లో రాజస్థాన్‌ విద్యార్థి సంఘ ఎన్నికల్లో 21 కాలేజీల్లో విజయం సాధించిన SFI అని న్యూస్ క్లిక్ వారు రిపోర్టు చేసిన విషయాన్ని ఇటీవల జరిగిందిగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll