కొన్ని ఫోటోలను ఫేస్బుక్ లో పోస్ట్ చేసి, అవి ముస్లింల పై హిందువులు దాడులు చేయడానికి సంబంధించినవని చెప్తున్నారు. దాంట్లో నిజమెంతుందో చూద్దాం.
క్లెయిమ్: ఢిల్లీ మత ఘర్షణలలో ముస్లింల పై హిందువులు దాడులు చేస్తున్న ఫోటోలు.
ఫాక్ట్ (నిజం): ఫోటోలు ఢిల్లీ మత ఘర్షణల తీరు పై నెల్లూరు లో జరిగిన ‘ప్రదర్శన’ కి సంబంధించినవి. అవి వాస్తవ ఘటన కి సంబంధించినవి కావు. పోస్ట్ లో చెప్పింది తప్పు.
ఫోటోల కింద ఉన్న కామెంట్స్ లో ఒక యూజర్ ఆ ఫోటోలు ఒక అవగాహన కార్యక్రమానికి సంబంధించినవని, వాటిల్లో తాను కూడా ఉన్నానని పేర్కొన్నాడు.
దాంతో, అతని టైం లైన్ లో చూసినప్పుడు, ఫిబ్రవరి 27న అతను అలాంటి ఫొటోలతోనే పెట్టిన పోస్ట్ ఒకటి లభించింది. ఆ పోస్టులో ఫోటోల గురించి ఈ విధంగా ఉంది- ‘దేశ రాజధాని #ఢిల్లీ లో RSS ఉగ్రవాదులు చేస్తున్న మారణహోమనికి వ్యతిరేకంగా #భారత_రాజ్యాంగ_పరిరక్షణ_JAC, నెల్లూరు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు’.
ఆ యూజర్ టైం లైన్ లో ఆ ప్రదర్శనలకు సంబంధించినట్లుగా ఉన్న వీడియోలతో ఉన్న పోస్ట్ ‘JAC Nellore 57 days’ అనే టైటిల్ తో ఉంది.
ఆ సమాచారంతో యూట్యూబ్ లో వెతికినప్పుడు, పోస్ట్ లోని ఫోటోలలో ఉన్న విజువల్స్ తో ఉన్న వీడియో లభించింది. ఆ వీడియో కి టైటిల్ ‘Save Delhi by Nellore JAC’ అని ఉంది. దానిని చూసినప్పుడు, అది ఒక ప్రదర్శనకి సంబంధించినదని స్పష్టంగా తెలుస్తుంది.
ఢిల్లీ ఘర్షణలకి సంబంధించి నెల్లూరు లో ఫిబ్రవరి 27న జరిగిన ప్రదర్శనల గురించి ప్రాంతీయ వార్త పత్రికలు ప్రచురించిన కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
చివరగా, అవి ఢిల్లీ మత ఘర్షణల తీరు పై నెల్లూరు లో జరిగిన ‘ప్రదర్శన’ కి సంబంధించిన ఫోటోలు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?